Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. ఎప్పుడంటే..?

ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25  తేదీ మధ్యలో ఆమె రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. ఎప్పుడంటే..?

Priyanka Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది. మొత్తం 3,570 కి.మీ మేర యాత్ర సాగనుంది. అయితే, ఇప్పటి వరకు సగభాగం యాత్ర పూర్తయింది. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈనెల 7న తెలంగాణ నుండి మహారాష్ట్రకు ఎంటర్ అయిన యాత్ర నాందేడ్ నుండి హింగోలి, వాషీమ్ జిల్లాల మీదుగా సాగింది. ఇవాళ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్ పూర్‌లోకి ప్రవేశించింది.

Rahul Jodo Yatra : ‘విద్వేషం చోడో.. భారత్ జోడో’.. భారత్‌కు కొత్త రాహుల్‌ని పరిచయం చేసిన జోడో యాత్ర

రాహుల్ పాదయాత్రలో ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా పాల్గోనున్నారు. ఇప్పటికే రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే, సోనియాతో పాటు ప్రియాంక వాద్రాకూడా ఆ సమయంలో రాహుల్ వెంట యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ తరపున ప్రచారంలో బిజీగా ఉన్నందున ప్రియాంక వాద్రా రాహుల్ పాదయాత్రలో పాల్గొనలేకపోయింది.

Bharat Jodo Yatra: ఘోర తప్పిదం.. భారత జాతీయ గీతానికి బదులు నేపాల్ జాతీయ గీతం ప్లే చేసిన కాంగ్రెస్

ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25  తేదీ మధ్యలో ఆమె సోదరుడు రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పాటు ఆమె భారత్ జోడో యాత్రలో పాల్గోనున్నట్లు తెలిసింది.