Obesity : చిన్నారుల్లో స్ధూలకాయంతో సమస్యలు

మార్కెట్​లో లభిస్తున్న వివిధ రకాల ఆయిల్​ ఫుడ్స్, తినుబండారాలు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతుంది.

Obesity : చిన్నారుల్లో స్ధూలకాయంతో సమస్యలు

Unhealthy Bmi

Obesity : కోవిడ్ తరువాత ఊబకాయం, అధిక బరువు అనేది చాలామంది చిన్నారులను పట్టిపీడిస్తున్న సమస్య. బడి వయస్సు పిల్లల్లో ఎక్కువమంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. కరోనాకు ముందు వరకు సన్నగా ఉన్న పిల్లలు కాస్తా ఒక్కసారిగా లావుగా, బొద్దుగా మారటంతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్లో పెరుగుతున్న కొవ్వు గురించి ఆందోళన చెందుతున్నారు. శరీరంలో అవసరానికి మంచి కొవ్వు చేరి.. ఆరోగ్యానికి చెడు చేసే అవకాశం ఉంటుందన్న బావనను వారు వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లల్లో వచ్చే స్థూలకాయం ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇలాంటి వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఇదే సమస్యతో బాధపడడం, పదిమంది మధ్య ఆత్మనూన్యతతో బతకాల్సి రావడం ఇబ్బందికర పరిస్థితికి దారి తీస్తుంది. ఊబకాయం అంటే శరీరంలో అవసరానికి మంచి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెడు చేసే ఓ వ్యాధి. ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్​ ఇండెక్స్​ , బీఎంఐ సూచిస్తుంది.

ఏ వ్యక్తికైనా చదరపు మీటర్​కు 30 కిలోలు ఉండే స్థూలకాయంగా లెక్కిస్తారు. కొంతమంది పిల్లల శరీర నిర్మాణం సగటు కంటే పెద్దదిగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండడం సహజం. పెరిగే కొద్ది మరింతగా పెరుగుతుండడం ఊబయకాయానికి గుర్తు. బరువు ఎత్తుకు సంబంధించిన పట్టిక చూసి డాక్టర్​లు స్థూలకాయాన్ని నిర్ధరణ చేస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా, బరువు, ఎత్తు నిష్పత్తులను, పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి ఎలాంటి చికిత్స అవసరం అనేది నిర్ణయిస్తారు. ఊబకాయం వల్ల గుండె వ్యాధులు, డయాబెటిస్​, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోకపోవడం, గురక పెట్టడం, కీళ్ల వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్​ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మార్కెట్​లో లభిస్తున్న వివిధ రకాల ఆయిల్​ ఫుడ్స్, తినుబండారాలు తీసుకోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా స్థూలకాయ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఆహార నియంత్రణ లేకపోవడం. సరైన ఆహారం, సమతుల్య ఆహారం లేకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సరిగా నిద్రలేక పోవడం కూడా ఊబకాయానికి దారి తీస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం. శరీరంలో హార్మోన్ల సమస్య ఉండటం. జన్యుపరంగా కూడా ఊబకాయ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్​ఫుడ్​ తీసుకోవడం. శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల బీపీ, సుగర్​, కొలెస్ట్రాల్ పెరగడం, పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. ఆస్తమా, నిద్రస మస్యలు రావడానికి అవకాశం ఉంది. మనసికంగా ఎక్కువ సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఊబకాయం సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు మంచి పోషకాహారాన్ని అందించాలి. డ్రైఫ్రూట్స్​,పాలు,పాల ఉత్పత్తులు,సలాడ్లు,పండ్లు వంటి వాటిని అందించాలి. స్వీట్లు తినడం తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఇలా చేయటం వల్ల కొంత మేర ఊబకాయం నుండి బయటపడే అవకాశం ఉంటుంది.