Film Chamber : పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ ఫెయిల్ అయింది

మీటింగ్ లో నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ''ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ బాగా వేస్తున్నారు, సినిమాలపై, నటీనటులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఓటీటీ..

Film Chamber : పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ ఫెయిల్ అయింది

Aadi Seshagirirao

Film Chamber :  గురువారం ఉదయం ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మరి కొన్ని సినీ యూనియన్స్ కలిసి ఫిలింఛాంబర్ లో మీటింగ్ నిర్వహించారు. పలువురు నిర్మాతలు, నటీనటులు కూడా వచ్చారు. ఫిలింఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి చర్చించడానికి, సోషల్ మీడియాలో సినిమాలపై, సినిమా స్టార్లపై అసత్య ప్రచారాలు చేసే దానిపై, ఓటీటీ, టికెట్ రేట్లపై చర్చించడానికి ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.

 

ఈ మీటింగ్ లో నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ”ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివ్ న్యూస్ బాగా వేస్తున్నారు, సినిమాలపై, నటీనటులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఓటీటీ సమస్య కూడా ఉంది. సెన్సార్ లేకుండానే ఓటీటీలలో కంటెంట్ రిలీజ్ అవుతుంది. దీన్ని అరికట్టాలి. ఫిల్మ్ పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ పూర్తిగా ఫెయిల్ అయింది. సినిమా రిలీజ్ అయిన రోజు లేదా మరుసటి రోజే యూట్యూబ్ లో సినిమా వస్తుంది” అని తెలిపారు.

మే 20 శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే..

 

ఇక సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ.. ”ఇటీవల ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా కొంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. తాజాగా టికెట్ రేట్లు పెంచటం మంచిది కాదు అని దిల్ రాజు మాట్లాడాడు. మరి గతంలో ప్రభుత్వంని పెంచమని అడిగేటప్పుడు సరైన రేట్లు అడగాల్సింది. అప్పుడు పెంచమని అడిగి ఇప్పుడు జనాలు థియేటర్లకు రావట్లేదు అంటే ఎలా? అప్పుడే కరెక్ట్ గా మాట్లాడి సరైన రేట్లని నిర్ణయిస్తే సమస్యలు వచ్చేవి కావు” అని అన్నారు.