Love Stroy: చైతూ ‘లవ్ స్టోరీ’ విడుదలపై నిర్మాత క్లారిటీ!

కరోనా సెకండ్ వేవ్ తో అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ప్యాకప్ చెప్పేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు లాక్ డౌన్, కర్ఫ్యూలతో థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాలను కూడా ల్యాబులకే పరిమితం చేశారు. అలా అన్నీ పూర్తిచేసుకొని విడుదల వాయిదా పడిన సినిమాలలో నాగ చైతన్యల లవ్ స్టోరీ కూడా ఒకటి.

Love Stroy: చైతూ ‘లవ్ స్టోరీ’ విడుదలపై నిర్మాత క్లారిటీ!

Love Stroy

Love Stroy: కరోనా సెకండ్ వేవ్ తో అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ప్యాకప్ చెప్పేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు లాక్ డౌన్, కర్ఫ్యూలతో థియేటర్లు మూతపడడంతో షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాలను కూడా ల్యాబులకే పరిమితం చేశారు. అలా అన్నీ పూర్తిచేసుకొని విడుదల వాయిదా పడిన సినిమాలలో నాగ చైతన్యల లవ్ స్టోరీ కూడా ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

చైతూకి జంటగా సాయిపల్లవి నటించగా ఇప్పటికే విడుదలైన సారంగదరియా పాట తెలుగు ప్రేక్షకాలోకాన్ని ఒక ఊపు ఆపేసింది. అదే క్రేజ్ లో ఏప్రిల్ 16న సినిమా విడుదల చేయాలని అనుకున్నా కరోనాతో అది కాస్తా వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు ఒక్కొక్కటీ అనుమతులు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయని వార్తలతో ముందుగా చైతూ లవ్ స్టోరీ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.

అయితే.. లవ్ స్టోరీ విడుదలపై ఆ సినిమా నిర్మాత సునీల్​ నారంగ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా విడుదలపై మాట్లాడిన సునీల్.. ఒకవేళ ఇప్పుడు థియేటర్లు తెరిచినా రోజుకు మూడు షోలు మాత్రమే అనుమతిస్తారని.. ఇలాంటి క్రమంలో లవ్​స్టోరి సినిమాను విడుదల చేయలేమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ సడలించిన తర్వాతే సినిమా విడుదల గురించి ఆలోచిస్తామని.. నాకు తెలిసి జులై రెండో వారంలో అలాంటి పరిస్థితి ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్​ చేస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని సునీల్ చెప్పారు.