Tollywood : టాలీవుడ్ సమస్యలు.. నిర్మాతలు ప్రతిపాదించిన పరిష్కారాలు..

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని..........

Tollywood : టాలీవుడ్ సమస్యలు.. నిర్మాతలు ప్రతిపాదించిన పరిష్కారాలు..

Tollywood (1)

Filim Chamber :  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని అంతర్గత ఇబ్బందులు, హీరోల రెమ్యునరేషన్స్.. ఇలా చాలా సమస్యలతో టాలీవుడ్ సతమతమవుతోంది. దీనిపై నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సమస్యలకి పరిష్కారం దొరికేవరకు కొన్ని రోజులు షూటింగ్స్ ఆపాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మిగిలిన సమస్యలకి కూడా నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్స్ తమకు తోచిన పరిష్కారాలని ప్రతిపాదించి మిగిలింది ఫిలిం ఛాంబర్ కి వదిలేశారు.

ఓటీటీ సమస్యకి పరిష్కారంగా భారీ బడ్జెట్‌ సినిమాలని థియేటర్లో విడుదలైన 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి, పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వాలి, 6 కోట్లలోపు బడ్జెట్‌ సినిమాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలి అని ప్రతిపాదించారు. సినిమా ప్రదర్శనకు ఉన్న వర్చువల్‌ ప్రింట్ ఫీజు ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలి అని నిర్మాతలు అన్నారు.

Tollywood : ఇండస్ట్రీలో అన్ని ఫేక్ కలెక్షన్లే.. ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు..

ఇక అన్నిటికంటే ముఖ్య సమస్య సినిమా టికెట్‌ ధరలు. సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని, మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలని, మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.

సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకీ పెరుగుతోందని, ప్రతి నిర్మాత ఛాంబర్‌, కౌన్సిల్‌ నియమ, నిబంధనలను పాటించాలని, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలని ప్రతిపాదించారు. వర్కర్స్ వేతనాలపై ఛాంబర్‌ తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. ఫైటర్స్‌ యూనియన్‌ సమస్యలు ఆ యూనియన్ తో చర్చించి ఛాంబర్‌ నిర్ణయం తీసుకోవాలి. నిర్మాతలను తప్పుదోవ పటిస్తోన్న మేనేజర్లు, కో-ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయాలని, మేనేజర్ల వల్ల డేట్స్ అడ్జస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, దీనిపై హీరోలతో చర్చించాలని ప్రతిపాదించారు.

Ram Charan : టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన రామ్ చరణ్

హీరోలు, పెద్ద ఆర్టిస్టులు కచ్చితమైన సమయ పాలన పాటించాలని, వారి అసిస్టెంట్స్ కి వసతి, సౌకర్యాలు ఆర్టిస్టులే చూసుకోవాలని, హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలని ప్రతిపాదించారు. ఈ సమస్యలన్నిటిపై చర్చించి ఫిలిం ఛాంబర్ తుది నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఈ సమస్యలపై ఒక పరిష్కారం వచ్చేదాకా నిర్మాతలు షూటింగ్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.