Dil Raju: ఓటీటీలతో నిర్మాతల ఒప్పందం.. ఇక అప్పుడే వస్తాయట!

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం చాలా వరకు తగ్గించారనే విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర దర్శకనిర్మాతలు....

Dil Raju: ఓటీటీలతో నిర్మాతల ఒప్పందం.. ఇక అప్పుడే వస్తాయట!

Producers Team Along With Dil Raju Settles Deals With Ott Platforms

Dil Raju: కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం చాలా వరకు తగ్గించారనే విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర దర్శకనిర్మాతలు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఇక లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విజృంభించడంతో, ప్రస్తుతం ప్రేక్షకులు వాటికే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఓటీటీలకు ప్రేక్షకాదరణ బాగా లభిస్తోంది. ఇక సినిమాల విషయంలోనూ ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఆచరిస్తున్న విధానంతో థియేటర్ల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోందని చిత్ర పరిశ్రమ భావిస్తోంది. ఒక సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అది ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో ప్రేక్షకుడు థియేటర్‌కు రావడమే మానేశాడు.

Tollywood Producers : మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు భేటీ

ఈ క్రమంలో తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 21 మంది సభ్యులతో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓటీటీ ప్లాట్‌ఫాం సంస్థలతో చర్చలు నిర్వహించారు. దిల్ రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన 10 వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టు 1 నుండి ఈ నిబంధన అమల్లోకి రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

OTT Realeses : నిర్మాతలు ఫిక్స్.. 50 రోజుల తర్వాతే ఓటీటీకి..

అయితే సినిమా ప్రొడక్షన్ ఖర్చులను నియంత్రించేందుకు నిర్మాతల మండలి ప్రయత్నిస్తోంది. హీరోహీరోయిన్లు, దర్శకుల రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో వారు డిమాండ్ చేసినట్లుగా తాము చెల్లించలేకపోతున్నట్లు పలువురు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కూడా ఓ నిర్ణయం త్వరగా తీసుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. అందుకే ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, త్వరగా ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. మరి ఈ అంశంపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.