Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి సంజయ్

Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన కార్యకర్తలను ఆయన అభినందించారు.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

‘‘ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఇచ్చిన హామీలను 15 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. హామీ ఇచ్చినట్లుగా సీఎం కేసీఆర్ 15 రోజుల్లో వాటిని నెరవేర్చాల్సిందే. గెలిచిన తర్వాత ఆ విషయం చెప్పకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరితే పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నాం. ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరే దమ్ముందా? మునుగోడు గెలుపు టీఆర్ఎస్‌దా.. కేటీఆర్‌దా.. లేక హరీష్ రావుదా? కమ్యూనిస్టులదా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి.

Munugode Bypoll Results: ‘సెమీఫైనల్‌’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్‌’పైనే

ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పని చేస్తే వచ్చింది 11 వేల మెజారిటీ. ఒక్కో పోలింగ్ బూత్‌కు టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పని చేస్తే బీజేపీ తరఫున ఒక కార్యకర్త పని చేశారు. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఒక్కో బీజేపీ కార్యకర్త సమానం. మునుగోడు ఓటమితో కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. ఓటమిపై సమీక్ష చేసుకుంటాం. అధికారమే లక్ష్యంగా అభివృద్ధి కోసం పని చేస్తాం. మునుగోడు గెలుపు కొందరు పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ది. ఎక్కడా డబ్బులు పట్టుబడకుండా పోలీసు వాహనాలు, అంబులెన్సులు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌ల ద్వారా డబ్బు తరలించారు. ఈ ఒక్క ఎన్నిక కోసం టీఆర్ఎస్ దాదాపు రూ.1,000 కోట్లు పంచింది. అయినా, ఎక్కడా డబ్బు దొరకలేదు. టీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.