Bathukamma : బతుకమ్మల మధ్య గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన

తెలంగాణలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Bathukamma : బతుకమ్మల మధ్య గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన

Bathukamma

Bathukamma : తెలంగాణలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌లోని ప్రతాపవాడతో మహిళలు వినూత్న రీతిలో బతుకమ్మ ఆడారు. సిలిండర్ ధరల పెరుగుదలను నిరసిస్తూ మధ్యలో గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ ఆడారు. గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు.

Read More : Bathukamma : ఎంగిలి పూల బతుకమ్మ వెనుక ఉన్న కథలు..ప్రత్యేక నైవేద్యాలు

‘గ్యాసుల ధరలు పెంచారు ఉయ్యాల్లో.. గరీబు చేస్తున్రు ఉయ్యాలో.. పెట్రోల్‌ ధర పెంచి ఉయ్యాల్లో ప్రాణాలు తీస్తున్రు ఉయ్యాల్లో.. కేంద్రం మోసాలు ఉయ్యాలో.. ఇక చెల్లనియ్యం ఉయ్యాల్లో’ అంటూ పాటలు పాడారు. కాగా బతుకమ్మల మధ్యలో సిలిండర్‌ పెట్టి ఆటలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాసు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోనంటున్నారు మహిళలు.

Read More : AR Rahman-Bathukamma Song : అల్లిపూల వెన్నెల… బతుకమ్మ పాట