Hyderabad Metro : కేటీఆర్ గారూ.. ఓసారి ఉదయం 9 గంటలకు మెట్రో ఎక్కండి.. మా కష్టాలు తెలుస్తాయి..ప్రయాణికుల ఆవేదన

హైదరాబాద్‌లో మెట్రో కష్టాలు మామూలుగా లేవు. ఓవైపు వేసవికాలం.. మరోవైపు కరోనా మళ్లీ ప్రబలుతోందని వార్తలు.. అయినా క్రిక్కిరిసిన మెట్రోలో ప్రయాణికుల జర్నీ ఎంతవరకూ సేఫ్ అనేది అర్ధం కావట్లేదు. ఇక ట్రైన్ ఎక్కేటపుడు, దిగేటపుడు ప్యాసింజర్ల కష్టాలు వినడం కాదు ప్రత్యక్షంగా చూస్తేనే అర్ధం అవుతుంది. మంత్రి కేటీఆర్ గారిని ప్రత్యక్షంగా ఈ కష్టాలు చూడమని జనం రిక్వెస్ట్ చేస్తున్నారు.

Hyderabad Metro : కేటీఆర్ గారూ.. ఓసారి ఉదయం 9 గంటలకు మెట్రో ఎక్కండి.. మా కష్టాలు తెలుస్తాయి..ప్రయాణికుల ఆవేదన

Hyderabad Metro

Hyderabad Metro : హైదరాబాద్‌లో మెట్రో కష్టాలు మామూలుగా ఉండట్లేదు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇక ట్రైన్ ఎక్కినవారంతా ద్వారం దగ్గరే నిలబడి ఎక్కేవారికి చోటు ఇవ్వకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ట్రైన్‌లు మిస్ అవుతూ ఆలస్యంగా ఆఫీసులకు చేరి బాస్‌లతో తిట్లు తినాల్సి వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు. రైల్వే అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు.

Also Read: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఇదీ పరిస్థితి.. కేటీఆర్ కు ప్రయాణికుడి ట్వీట్

ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో రద్దీ మరింత పెరిగింది. ఇక రద్దీకి తగ్గట్లుగా రైళ్లు సరిపోవట్లేదు. ఎక్కేవారు.. దిగేవారు.. తోపులాటలు..గొడవలతో రోజు మొదలవుతోంది. ట్రైన్‌ లోపల జనం క్రిక్కిరిసి ఉంటున్నారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా ముందు వరసల్లో నిలబడినవారు లోనికి దారి ఇవ్వట్లేదు. దాంతో ట్రైన్ ఎక్కేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ట్రైన్స్‌ను స్కిప్ చేస్తే కానీ ట్రైన్ ఎక్కే అవకాశం దొరకట్లేదు. ద్వారం దగ్గర నిలబడిన వారిని చోటు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా జరగకపోవడంతో తోపులాటలు, గొడవలకు దారి తీస్తున్నాయి. రైల్వే సిబ్బంది పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు.

Also Read: హైదరాబాద్ మెట్రోకు రెండేండ్లు.. ఎన్నో రికార్డులు

ఇక వేసవికాలం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. విపరీతమైన రద్దీలో చాలామంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ రద్దీలో రోజువారి ప్రయాణం ఇలాగే కొనసాగితే అనారోగ్యం పాలవుతామని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మంత్రి కేటీఆర్ గారూ ఓసారి మా కష్టాలు చూడండని అంటున్నారు. ఉదయం 9 గంటలకు మెట్రో ఎక్కితే తమ కష్టాలేంటో తెలుస్తాయని.. దీనికంటే ఉద్యోగం చేయడమే చాలా ఈజీ అని వాపోతున్నారు. ఇక సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో 5 గంటలనుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం ఇబ్బందులు చూసైనా మంత్రి స్పందించాల్సి ఉంది.

హైదరాబాద్ మెట్రో బెటర్ : ఎలాంటి అనుమానాలు వద్దు – కేటీఆర్

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతోంది .. జాగ్రత్తలు పాటించమని చెబుతున్న అధికారులు మెట్రోల్లో ఇంత క్రిక్కిరి జనం ఎక్కుతుంటే ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇదే కొనసాగితే ఎటువంటి విపత్తు జరగవచ్చునో అనే భయం కూడా అందరిలో ఉంది. ఒక్కసారిగా కరోనా పడగ విప్పిందంటే ఎంతోమంది మళ్లీ దీని బారిన పడాల్సి వస్తుంది. మరి జనం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.