Madhya Pradesh: మోదీని చంపాలంటూ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతకు బెయిల్ నిరాకరించిన కోర్టు

ఒక కార్యక్రమంలో రాజా పటేరియా మాట్లాడుతూ ప్రధాని మోదీని చంపాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. ఈ అంశంపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Madhya Pradesh: మోదీని చంపాలంటూ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతకు బెయిల్ నిరాకరించిన కోర్టు

Madhya Pradesh: ప్రధాని మోదీని చంపాలంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేతకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. గత నెలలో మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా పటేరియా అనే కాంగ్రెస్ పార్టీ నేత ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

ఒక కార్యక్రమంలో రాజా పటేరియా మాట్లాడుతూ ప్రధాని మోదీని చంపాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. ఈ అంశంపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజా పటేరియాను అరెస్టు చేశారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ, పటేరియా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పటేరియాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Tiger Attack: కేరళలో పులి దాడిలో రైతు మృతి.. పొలంలో పని చేసుకుంటుండగా దాడి చేసిన పులి

జస్టిస్ సంజయ్ ద్వివేది ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, అది సాధారణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా జీవితంలో ఉన్న రాజకీయ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.

Pak Embassy: వీసా ఇంటర్వ్యూలో సెక్స్ గురించి అడిగారు.. పాక్ రాయబారిపై పంజాబ్ ప్రొఫెసర్ ఆరోపణ

అయితే, మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నెల రోజుల్లోగా తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రాజా పటేరియా గతంలో రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేశాడు.