Pumpkin : మధుమేహులకు సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ!

మధుమేహంతో బాధపడుతున్న వారిలో దృష్టి లోపం, చర్మ వ్యాధులు, నరాల దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.

Pumpkin : మధుమేహులకు సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ!

Pumpkin

Pumpkin : మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ మంచి ఆహారంగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయలో పాలిసాకరైడ్లు, ఖనిజాలు, కెరోటిన్, విటమిన్లతోపాటుగా అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయలో ఉండే పాలిసాకరైడ్లు డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. పాలిసాకరైడ్లు శరీర బరువు, అధిక కొలెస్ట్రాల్,శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.

డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక పరిశోధనలో ఆల్కలాయిడ్ త్రికోణెలైన్ , నికోటినిక్ ఆమ్లం ఉండటం వలన గుమ్మడికాయ మిథనాల్ సారం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. గుమ్మడికాయ తినిపించిన ఎలుకల్లో తొలి 15 నిమిషాల సమయంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కనిపించగా, గంట తరువాత రక్తంలో గ్లూకోజ్ క్రమంగా తగ్గుటాన్ని గమనించారు. గుమ్మడికాయలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఇన్సులిన్ నుఉత్తేజపరచడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ సి సహాయపడుతుంది.

గుమ్మడికాయ విత్తన నూనెలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తాయి. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీరంలో నైట్రిక్ ఆమ్లాన్ని పెంచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్‌ను నివారించడానికి, డయాబెటిస్‌లో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి గుమ్మడికాయతోపాటు అందులో ఉండే విత్తనాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాలతో నిండిఉన్న గుమ్మడికాయ డయాబెటిస్‌కు మంచిదని భావిస్తున్నప్పటికీ, రక్తంలో గ్లూకోజ్‌పై దాని సామర్థ్యంపై అనేక అనుమానాలు లేకపోలేదు.

మధుమేహంతో బాధపడుతున్న వారిలో దృష్టి లోపం, చర్మ వ్యాధులు, నరాల దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. వీటిని నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో గుమ్మడికాయ కీలకపాత్రపోషిస్తుంది. గుమ్మడికాయ గ్లెసిమిక్ ఇండెక్స్ లో 75 వద్ద అధిక స్ధానంలో ఉంది. అయితే గ్లెసెమిక్ లోడ్ లో మాత్రం 3 వద్ద తక్కువగా ఉంది. అధిక గ్లెసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల గుమ్మడికాయ మధుమేహులకు మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. అయితే గ్లెసిమిక్ లోడ్ తక్కువగా కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలను పెంచదని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక మొత్తంలో గుమ్మడికాయను తీసుకోవటం మాత్రం మధుమేహ రోగులకు హానికరం.