Punjab Election: కాంగ్రెస్ లో చేరిన వివాదాస్పద పంజాబీ సింగర్

ప్రముఖ పంజాబీ సింగర్ "సిద్ధూ మూసీవాలా" కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్‌లో పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ న‌వ‌జ్యోత్‌

Punjab Election: కాంగ్రెస్ లో చేరిన వివాదాస్పద పంజాబీ సింగర్

Punjab

Punjab Election: ప్రముఖ పంజాబీ సింగర్ “సిద్ధూ మూసీవాలా” కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్ లో  సీఎం చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ, పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ స‌మ‌క్షంలో సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంజాబీ గాయకుడు కాంగ్రెస్ తీర్థం స్వీకరించడం విశేషం

సిద్ధూ మూసీవాలా ఓ యూత్ ఐకాన్ అని,ఇంటర్నేషనల్ ఫిగర్ అని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ అన్నారు. సిధ్ధూ మూసీవాలాని కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు విలేఖరులతో మాట్లాడుతూ నవజ్యోత్ సిద్ధూ తెలిపారు. సంద‌ర్భంగా సింగ‌ర్ సిద్ధూ మూసీవాలా మాట్లాడుతూ.. పంజాబీల గ‌ళం దేశ‌మంత‌టా వినిపించ‌డానికే తాను కాంగ్రెస్‌లో చేరాన‌ని చెప్పారు.

పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు వివిధ రంగాల్లో ప్ర‌ముఖులుగా పేరు సంపాదించిన వాళ్లను త‌మ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక ప‌లువురు నేత‌లు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంపింగ్‌లు చేస్తున్నారు.

మాన్సా జిల్లాలోని మూసా గ్రామానికి చెందిన సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభదీప్ సింగ్ సిద్ధూ. సిద్ధూ మూసేవాలా తన పాట ‘పంజ్ గోలియన్’ (ఐదు బుల్లెట్లు)లో హింస మరియు తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించారనే ఆరోపణలపై ఆయుధాల చట్టం కింద పంజాబ్ పోలీసులు గత ఏడాది అతడిపై కేసు నమోదు చేశారు. దీనికి ముందు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్రమంతా కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఐదుగురు పోలీసులతో కలిసి బద్బార్ గ్రామంలో ఫైరింగ్ రేంజ్‌లో సిద్ధూ AK-47 రైఫిల్‌ను కాల్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరొక కేసులో అతడు బుక్ అయ్యాడు. గతేడాది ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల నిరసనలో ఆయన కూడా భాగమయ్యారు.

28 ఏళ్ల పంజాబీ గాయకుడైన సిద్ధూ మూసేవాలా మాన్సా లేదా మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.

ALSO READ Super Strain : మరో కొత్త వేరియంట్ రావచ్చు..డెల్టా+ఒమిక్రాన్= సూపర్ స్ట్రెయిన్!