Punjab: రాహుల్, ప్రియాంక ఇంకా చిన్నపిల్లలే..! కెప్టెన్ అమరీందర్ పంచ్‌ డైలాగ్

రాహుల్, ప్రియాంకలు చాలామందిలాగే సాధారణ రాజకీయ నాయకులు. టైంతో పాటు వాళ్లు ఎదగాల్సి ఉంది. టైంతో పాటే వాళ్లు..

Punjab: రాహుల్, ప్రియాంక ఇంకా చిన్నపిల్లలే..! కెప్టెన్ అమరీందర్ పంచ్‌ డైలాగ్

Captain Amarinder Singh

Punjab : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దేశమంతటా ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్, రెబల్స్, ఇతర విపక్ష పార్టీల నాయకుల మాటలు, విమర్శలు, విసుర్లు, ఆరోపణలతో పంజాబ్ లో పోల్ హీట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. రేస్ లో ముందున్న కాంగ్రెస్ పార్టీని, పార్టీ హైకమాండ్ ను ఉద్దేశించి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

కాంగ్రెస్ ఆశా కిరణాలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాజకీయ పరిణతిపై కెప్టెన్ అమరీందర్ సింగ్ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. గాంధీ వారసులు రాజకీయంగా ఇంకా చిన్నపిల్లలే అన్నారు. రాజకీయ నాయకుడిగా(పొలిటీషియన్)గా రాహుల్ గాంధీ ఇంకా ఎదగాల్సి ఉందని.. పరిణతి సాధించాల్సి ఉందని కెప్టెన్ చెప్పారు.

Read More : Punjab Elections 2022 : సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ సొంతగూటికే.. కేవలం 39 రోజుల్లో 3 సార్లు పార్టీ మార్పు..!

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్, ప్రియాంక గాంధీలు.. మాజీ సీఎం అయిన కెప్టెన్ పైనా ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పాలన సాగించారని ఇటీవలే అన్నారు. ఆయన్ను తొలగించడానికి, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వెంటవెంటనే తీసుకున్న రాజకీయ, పాలన పరమైన పరిణామాలను వివరిస్తూ.. కెప్టెన్ పై విమర్శలు చేశారు. ఐతే.. ఈ విమర్శలకు బదులిచ్చేందుకు కెప్టెన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. రాహుల్, ప్రియాంకలు రాజకీయంగా ఇంకా పూర్తిస్థాయిలో ఎదగలేదన్నారు అమరీందర్ సింగ్. పిల్లలు చెప్పేదానికి తాను రిప్లై ఇవ్వదల్చుకేలేదన్నారు.

Amarinder Rahul Gandhi

Amarinder Rahul Gandhi

“నాకు ముని మనవళ్లున్నారు. వాళ్లు నాకు పిల్లలతో సమానం. వాళ్ల నాన్న నాకు స్నేహితుడు. రాహుల్ కు యాభయ్యేళ్లున్నంత మాత్రాన రాహుల్ గానీ, ప్రియాంక గానీ ఐన్‌స్టీన్ అంత గొప్పవాళ్లేం కాదు కదా”అని కామెంట్ చేశారు కెప్టెన్. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఆర్డర్స్ ను పాటించానన్న రాహుల్ ఆరోపణలను ఖండించారు.

“రాహుల్, ప్రియాంకలు చాలామందిలాగే సాధారణ రాజకీయ నాయకులు. టైంతో పాటు వాళ్లు ఎదగాల్సి ఉంది. టైంతో పాటే వాళ్లు ఎక్స్ పీరియన్స్ ను కూడా సంపాదించాల్సి ఉంది. రాహుల్ గాంధీకి ఇంకా టైం పడుతుందని మాత్రం చెప్పగలను” అన్నారు అమరీందర్ సింగ్.

Read This : Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్

అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్-PLC.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంది. 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 65 సీట్లలో కంటెస్ట్ చేస్తోంది. కూటమిలోని ధిండ్సా పార్టీ 15 సీట్లలో బరిలోకి దిగుతోంది. సీనియర్ నాయకుడినైన తనను సీఎం పదవినుంచి తప్పించిన పద్ధతిని తప్పుపట్టిన కెప్టెన్.. ఈ ఎన్నికల్లో వందశాతం గెలుపు తమదేనని ధీమాను వ్యక్తపరిచారు.

పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.