మా పెళ్లికి గిఫ్టులు వద్దు…ఆ డబ్బు రైతు ఉద్యమానికి విరాళమివ్వండి..

  • Published By: nagamani ,Published On : December 10, 2020 / 02:03 PM IST
మా పెళ్లికి గిఫ్టులు వద్దు…ఆ డబ్బు రైతు ఉద్యమానికి విరాళమివ్వండి..

Punjab family married wedding gifts donation box for farmers : వ్యవసాయ చట్టాలను వ్యతరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీలో చేస్తున్న ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా పంజాబ్ లోని ఓ కుటుంబంలో జరిగే వివాహంలో రైతు ఉద్యమానికి మద్దతునిస్తూ..రైతుల కోసం మేమున్నామని..సాటి చెప్పిందో కుటుంబం.


ఓకుటుంబంలో జరిగే పెళ్లిలో ఓ బాక్సును ఏర్పాటు చేశారు. ‘‘ అథితులెవ్వరూ మా పెళ్లికి ఎటువంటి బహుమానాలు ఆ ఖర్చుతో రైతుల ఉద్యమానికి విరాళంగా ఇవ్వండి’’ అని పిలుపునిచ్చిందో కుటుంబం. రైతులకు బాసటగా నిలచి వారికి విరాళం ఇవ్వాలనుకున్నవారు ఈ బాక్సులో మీ కానుకల్ని వేయండి అని తెలిపింది.


పంజాబ్ రాష్ట్రంలోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ పట్టణంలో శ్రీ ముక్త్సర్ సాహిబ్ పట్టణానికి చెందిన వరుడు అభిజిత్ సింగ్ తన వివాహం చేసుకున్నారు. తన వివాహ విందు సందర్భంగా రైతుల కోసం ఏదైనా చేయాలని వరుడితో పాటు అతని బంధువులు అనుకున్నారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులందరికి పిలుపునిస్తూ.. తమకు బహుమతులు ఇవ్వవద్దని, దానికి బదులుగా ఉద్యమిస్తున్న రైతులకు డబ్బును విరాళంగా అందజేయండి అంటూ వివాహ వేడుకలో రైతు విరాళం డబ్బాను ఏర్పాటు చేశారు.


కేంద్రప్రభుత్వం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తాము సహాయ పడేందుకు తమ పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులకు బదులుగా రైతులకు విరాళాలు ఇవ్వాలని కోరామని ఇది మా బాధ్యతగా భావించి ఇలా చేశామని వరుడు అభిజిత్ సింగ్ తెలిపాడు. ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన వరుడిని, అతని కుటుంబాన్ని పలువురు అభినందించారు.