Punjab govt free power : పంజాబ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన..నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఫ్రీ

పంజాబ్ CM భగవంత్ మాన మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు శుభవార్తు చెబుతూ..ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఉచితం అని ప్రకటించారు.

Punjab govt free power : పంజాబ్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన..నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఫ్రీ

Punjab govt free power : పంజాబ్ లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఆప్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. పంజాబ్ లో నివాస గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల మేర విద్యుత్ ను ఉచితంగా ఇస్తా ప్రకటించారు. ఇది శుక్రవారం (జూన్ 1,2022) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో ఒకటి అయిన ఉచిత విద్యుత్ పథకం అమలోకి వచ్చేలా చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ గత ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. గత పాలకులు హామీలు ఇవ్వటమే గానీ అమలు చేసింది లేదని అలాగే ఐదేళ్లు కాలం గడిపేశారు అంటూ విమర్శించారు. కానీ మా ప్రభుత్వం అలాకాదు..ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని దాంట్లో భాగమే ఈ ఉచిత విద్యుత్ అని తెలిపారు. తమ ప్రభుత్వం అమలులోకి వచ్చాకా పంజాబ్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాం అని..ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రజలకు జీరో బిల్లులు వస్తాయని..డిసెంబర్ 31,2021 ముందు ఉన్న అన్ని విద్యుత్ బిల్లులు మాఫీ చేయబడతాయని తెలిపారు. ఈ రోజు నుంచి పంజాబ్ లోని ప్రతి కుటుంబం ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందుతుంది అని భగవంత్ మాన్ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలియజేశారు.

2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆ పార్టీ చేసిన కీలక వాగ్దానాలలో ఒకటిగా ఉంది. పంజాబ్ లో ఉచిత విద్యుత్ పథకం గురించి ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు.తమ పార్టీ చెప్పినట్టే చేస్తుందని స్పష్టంచేశారు. ఉచిత విద్యుత్ గురించి పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మాట్లాడుతూ..300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ. 1,800 కోట్ల అదనపు భారం పడుతుందని గత నెలలో ఆప్ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు.

దేశంలో రెండో రాష్ట్రం పంజాబ్
దేశంలో ఢిల్లీ తర్వాత ప్రజల నివాసాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రెండో రాష్ట్రం పంజాబ్ అని ఆప్ నేత, ఎంపీ గౌరవ్ చద్దా పేర్కొన్నారు. రెండూ ఆప్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. పంజాబ్ కు ఇది చారిత్రాత్మకమైన రోజని..దేశంలో ఢిల్లీ తర్వాత పంజాబ్ లో ప్రజలు ఉచిత విద్యుత్ అందుకుంటున్నారని అన్నారు. పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ ఇచ్చిన హామీ రూపం దాల్చింది అని పేర్కొన్నారు.