MP Simranjit Singh : భగత్‌సింగ్‌పై పంజాబ్‌ ఎంపీ కాంట్రవర్సీ కామెంట్స్‌

సిమ్రన్‌జిత్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానించారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. సిమ్రన్‌ జిత్‌ బాధ్యతారహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ట్వీట్ చేసింది.

MP Simranjit Singh : భగత్‌సింగ్‌పై పంజాబ్‌ ఎంపీ కాంట్రవర్సీ కామెంట్స్‌

Simranjit Singh (1)

MP Simranjit Singh : విప్లవవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌పై పంజాబ్‌ ఎంపీ, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సిమ్రన్‌జిత్‌సింగ్‌ మాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగత్‌సింగ్‌ ఉగ్రవాది అంటూ పేర్కొన్నారు. భగత్‌సింగ్‌ ఓ యువ ఆంగ్ల నౌకాదళాధికారిని హత్య చేశాడని…. సిక్కు కానిస్టేబుల్ చన్నన్ సింగ్‌ను హతమార్చాడని వ్యాఖ్యానించారు.

ఆ సమయంలో జాతీయ అసెంబ్లీపై బాంబు విసిరాడని తెలిపారు. ఈ చర్యలను బట్టి చూస్తే భగత్‌సింగ్ కచ్చితంగా ఉగ్రవాదేనని సిమ్రన్‌జిత్‌ కాంట్రవర్సీ కామెంట్‌ చేశారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌లలో గిరిజనులపై నక్సలైట్ల ముద్రవేసి చంపడంపైనా ధ్వజమెత్తుతానని సిమ్రన్‌ జిత్‌ స్పష్టం చేశారు.

Remarks on Indian Flag: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సిమ్రన్‌జిత్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానించారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. సిమ్రన్‌ జిత్‌ బాధ్యతారహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ట్వీట్ చేసింది.

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలను పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌సింగ్‌ రాంధావా తీవ్రంగా ఖండించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యువకుడిని నేడు ఉగ్రవాదిగా పోల్చడం సరికాదన్నారు. సిమ్రన్‌జిత్ మన్ జీ.. దేశం కోసం ప్రాణాలర్పించే వారిని, దేశానికి వ్యతిరేకంగా పోరాడేవారిని వేరుచేసి మాట్లాడటం నేర్చుకోండని హితవు పలికారు.