Punjab Police: ఉగ్రవాదుల అరెస్ట్.. 48 విదేశీ తుపాకులు.. 1300 సిమ్​కార్డులు!

పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఓ స్మగ్లర్, టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద విదేశీ తుపాకులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అతని వద్ద నుండి అధికారులు 48 విదేశీ తుపాకులు, 1300 సిమ్​ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Punjab Police: ఉగ్రవాదుల అరెస్ట్.. 48 విదేశీ తుపాకులు.. 1300 సిమ్​కార్డులు!

Punjab Police

Punjab Police: పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన ఓ స్మగ్లర్, టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద విదేశీ తుపాకులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అతని వద్ద నుండి అధికారులు 48 విదేశీ తుపాకులు, 1300 సిమ్​ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుండి పట్టుబడిన తుపాకులు, అతని వద్ద లభించిన సిమ్ కార్డులను చూస్తే అతని కార్యకలాపాలు ఏ స్థాయిలో నడిపిస్తున్నాడో అర్ధమవుతుంది.

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలతో, యుఎస్, కెనడా మరియు యుకెలో ఉన్న భారత వ్యతిరేక ఖలీస్తానీ అంశాలతో పట్టుబడిన ఉగ్రవాది జగ్‌జిత్‌ కి ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండగా భారీగా విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు ఉగ్రవాది కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆయుధాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉద్దేశించినవి అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దింకర్ గుప్తా అన్నారు.

ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసుల బృందం అతని నుండి రెండు నైలాన్ సంచులను స్వాధీనం చేసుకోగా ఇందులో వేర్వేరు విదేశీ తయారీ 48 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక మరో ఘటనలో భారత్​- బంగ్లాదేశ్ సరిహద్దును అక్రమంగా దాటుతున్న హాన్​ జున్వే(35) అనే చైనా దేశస్థుడిని భద్రతా దళాలు పట్టుకున్నాయి. అతని వద్ద నుంచి అధికారులు 1300 సిమ్​ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో భారత్​లో ఈ సిమ్​కార్డులను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతనికి కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.