Viral Videos: తనను తాను కుందేలుగా ఫీలవుతున్న పప్పీ!

పెంపుడు జంతువులలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కుక్కలకు సంతాగ్రహి శక్తి ఎక్కువగా ఉండడంతో పాటు అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాయి

Viral Videos: తనను తాను కుందేలుగా ఫీలవుతున్న పప్పీ!

Viral Videos

Viral Videos: పెంపుడు జంతువులలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కుక్కలకు సంతాగ్రహి శక్తి ఎక్కువగా ఉండడంతో పాటు అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అందుకే కుక్కలకు మనుషులతో ఎక్కువ సంబంధాలుంటాయి. ఇక పెంపుడు కుక్కలనైతే మనుషులు ఇంట్లో సభ్యులుగా చూసున్నారు. రకరకాల బ్రీడ్స్ అందుబాటులో ఉండే ఈ పెట్ డాగ్స్ అందంగా ఉండడంతో పాటు క్యూట్ గా అనుకరణలు చేస్తుంటాయి.

అలానే.. ఓ పెట్ డాగ్ కుందేలును అనుకరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుందెలంటే మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్లే పెంపుడు జంతువని అందరికీ తెలిసిందే కదా. కుందేలు చిన్నగా గెంతుతూ ముందుకెళ్తుంది. కానీ, కుక్క మాత్రం నడుచుకుంటూ ముందుకెళ్తుంది. అయితే.. ఈ కుక్కపిల్ల మాత్రం కుందేలు మాదిరి గెంతుకుంటూ వెళ్తుంది.

ఈ వీడియోలో చూస్తున్న దాని ప్రకారం ఓ కుందేలు గెంతుతూ ముందుకెళ్తే.. పప్పీ దాని స్వభావాన్ని పక్కనపెట్టి కుందేలును అనుకరిస్తూ గెంతుతూ ముందుకెళ్లింది. పప్పీ కుందేలును అనుకరించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికి 3 మిలియన్ మంది వీక్షించగా.. పప్పీని నెటిజన్లు అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.