Puri Jagannadh: పూరీ కన్ను మళ్ళీ బాలీవుడ్ మీద పడిందా?

పూరి సినిమాలో హీరో కాస్త తేడాగా ఉంటాడు. తేడా అంటే భిన్నంగా మాత్రమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు.. చూసే ప్రేక్షకులకు నిజమే కదా అనేలా ఫీలింగ్ తెప్పిస్తాడు. అది ప్రేమ అయినా.. జాతీయత అయినా.. మాఫియాను కూడా పూరి ముచ్చటగా చూపిస్తాడు. అందుకే సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరోలందరూ పూరి ఇష్టపడతారు.

Puri Jagannadh: పూరీ కన్ను మళ్ళీ బాలీవుడ్ మీద పడిందా?

Puri Jagannadh

Puri Jagannadh: పూరి సినిమాలో హీరో కాస్త తేడాగా ఉంటాడు. తేడా అంటే భిన్నంగా మాత్రమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు.. చూసే ప్రేక్షకులకు నిజమే కదా అనేలా ఫీలింగ్ తెప్పిస్తాడు. అది ప్రేమ అయినా.. జాతీయత అయినా.. మాఫియాను కూడా పూరి ముచ్చటగా చూపిస్తాడు. అందుకే సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరోలందరూ పూరి ఇష్టపడతారు. పూరి జగన్నాధ్ ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలను తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్ ను తెలుగులో స్టార్ హీరోను చేసిన బద్రిని తుషార్ కంపూర్, గ్రేసీ సింగ్ జంటగా తెరకెక్కించిన పూరి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ తెరకెక్కించి బాప్ రే అనిపించాడు.

బుడ్డా సినిమా తర్వాత పూరి ఎందుకో మళ్ళీ బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా తెలుగు సినిమాలనే తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మాత్రం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను మాత్రం పాన్ ఇండియా సినిమాగా హిందీలో కూడా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్లో అతిపెద్ద బ్యానర్ గా పేరున్న ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహార్ తో కలిసి పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు కరణ్ జోహార్ తో కలిసి మరో హిందీ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కూడా పూరి జగన్నాధ్ కథా చర్చలు జరుగుతున్నాయని వినిపిస్తుంది. నిజానికి ఈ కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావాల్సింది. మన పోకిరి సినిమాను సల్మాన్ హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి భారీ సక్సెస్ కొట్టాడు. అప్పటి నుండే సల్మాన్ పూరితో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. కానీ, ఎందుకో అది ఇప్పటికీ పట్టాలెక్కలేదు. అయితే.. ఈసారి లైగర్ తర్వాత బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వస్తుండడంతో పూరి బీటౌన్ మీద ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ముందుగా పూరి రీఎంట్రీకి బ్యానర్ ఏది అవుతుందో.. హీరో ఎవరు అవుతారో చూడాలి!