Puri Musings : 85 రూపాయలకే సొంతిల్లు..! ఎక్కడో తెలుసా..?

రీసెంట్‌గా 85 రూపాయలకే సొంతిల్లు కొనుక్కోవచ్చు అంటూ పూరీ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.. ఇంతకీ 85 రూపాయలకే ఇళ్లు ఎక్కడంటే..?

Puri Musings : 85 రూపాయలకే సొంతిల్లు..! ఎక్కడో తెలుసా..?

Puri Musings

Puri Musings: గతేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ప్రపంచంలో ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో ప్రాంతాలు, హిస్టారికల్ ప్రదేశాల గురించి చెప్తూ వస్తున్నారు. రీసెంట్‌గా 85 రూపాయలకే సొంతిల్లు కొనుక్కోవచ్చు అంటూ పూరీ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ 85 రూపాయలకే ఇళ్లు ఎక్కడంటే.. ఇటలీ దేశంలో.. ఆ ప్రదేశం గురించి, అక్కడ ఇళ్లు కొనడం గురించి పూరీ వివరంగా చెప్పారు.

‘ఇటలీ అందమైన దేశం.. అక్కడ ఏ నగరం చూసినా కొన్ని వేళ్ల చరిత్ర ఉంటుంది.. ఒక్కో భవనం.. ఒక్కో అద్భుతమైన కట్టడం.. ఇటలీలో ఎన్నో హిస్టారికల్ టౌన్స్ ఉన్నాయ్.. ఎప్పుడో కట్టినవి.. చక్కటి ఇళ్లు, వీధులు, పార్కులతో చాలా పొయెటిక్‌గా ఉంటాయ్.. కొన్ని నగరాల్లో పనిదొరక్క, బతకడం కష్టమైపోయి, అక్కడున్న అందరూ టౌన్స్ విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలా ఎన్నో టౌన్స్ ఖాళీ అయిపోయాయ్. ఇప్పుడక్కడ పిట్ట మనిషి ఉండడం లేదు. కానీ, ఆ టౌన్స్ చూస్తే.. ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నాయ్.

గవర్నమెంట్ వాటిని రీ పాపులేట్ చెయ్యాలని నిర్ణయించుకుంది. అక్కడున్న ఒక్కో ఇంటిని ఒక యూరోకి అమ్మడం మొదలుపెట్టింది. మన కరెన్సీలో 85 రూపాయలు అంతే. అలాంటి ఇళ్లు లోకల్స్ మాత్రమే కాదు, మనం కూడా కొనుక్కోవచ్చు. అక్కడున్న మున్సిపాలిటీ వాళ్లు మనకి అమ్ముతారు. అయితే ఆ ఇంటిని మీరు రెనోవేట్ చేస్తామని వాళ్లకి హామీ ఇవ్వాలి. డిపాజిట్‌గా పాతిక వేలు.. లేదా, యాభై వేలు కడితే సరిపోద్ది. రెనోవేషన్ టైంలో ఆ డబ్బులు తిరిగి మనకే ఇచ్చేస్తారు. కొన్ని టౌన్స్‌లో ఆ డిపాజిట్ కూడా తీసుకోడం లేదు. అలాగే రెనోవేషన్ కోసం 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు మనకి టైం ఇస్తారు.

ప్రతి టౌన్‌కి ఒక ఆర్కిటెక్ట్, ఒక బిల్డర్ ఉంటారు. మీరు వాళ్లకే వర్క్ ఇవ్వాలి. ఒక ఆర్కిటెక్ట్‌నే ఎందుకు పెడతారంటే.. వాళ్లు ఎక్స్‌టీరియల్‌లో ఆ టౌన్ క్యారెక్టర్ మారిపోకుండా చూస్తారు. ఆ ఇళ్లన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవి. రూఫులన్నీ స్ట్రాంగ్‌గా ఉంటాయని గ్యారెంటీ లేదు. స్ట్రాంగ్‌గా లేకపోతే ఎక్కువ ఖర్చవుద్ది. చిన్న ఇంటికి మినిమం పాతిక లక్షలు రెనోవేషన్ ఖర్చులవుతాయ్. ఇంటి సైజునిబట్టి ఖర్చులు పెరుగుతాయ్.

కావాలంటే ఒక యూరో చొప్పున టౌన్‌ మొత్తం కొనుక్కోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందర్నీ పోగోసి, అలాంటి టౌన్‌లో తలో ఇళ్లు కొనేసుకుని, రెనోవేషన్స్ చేయించుకుంటే ఇటలీలో  సొంతంగా మనకో టౌన్ ఉన్నట్టే. టూరిస్ట్ ప్లేస్‌‌గా డెవలప్ చేస్తే అదిరిపోద్ది. ఇప్పుడు 11 టౌన్స్ సేల్ కోసం రెడీగా ఉన్నాయ్. వాటి పేరు.. ముసుమెలి, క్యాస్ట్రోపిగ్నానో, లసర్నా, సింక్‌ఫ్రాండీ, ఒల్లల్లాయి, ట్రాయినా, గంగీ, జుంగోలీ, సంబుకా.. ఒకసారి యూట్యూబ్‌లో ఈ టౌన్స్ చూడండి. మీక్కూడా నచ్చితే అందరం తలో ఇళ్లు కొనేద్దాం’.. అని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.