Pushpa 2: గ్లోబల్ మూవీ సీక్వెల్‌తో పుష్ప సీక్వెల్ బ్యాంగ్.. మామూలు స్కెచ్ కాదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు పుష్ప రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు పుష్ప రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్‌ను రెడీ చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

Pushpa 2: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

ఇక ఈ గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక, ఈ గ్లింప్స్‌ను హాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ అవతార్-2తో పాటు రిలీజ్ చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అవతార్-2 వంటి ప్రెస్టీజియస్ మూవీతో పుష్ప-2 బ్యాంగ్‌ను థియేటర్లలో వదిలితే అది జనాలకు ఎక్కువగా రీచ్ అవుతుందుని సుకుమార్ భావిస్తున్నాడట. ఇక ఈ మాస్టర్ ప్లాన్‌తో ఇప్పటికే సుక్కు అండ్ టీమ్ రంగంలోకి దిగి వర్కవుట్ చేస్తున్నారట.

Pushpa 2: శేషాచలం నుండి థాయ్‌లాండ్‌కు మారిన పుష్ప స్మగ్లింగ్.. నిజమేనా?

త్వరలోనే పుష్ప2 సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ అయితే రావడం ఖాయమని చిత్ర వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ బ్యాంగ్‌ను ఆడియెన్స్‌కు ట్రీట్‌గా ఇచ్చాక, రెగ్యులర్ షూటింగ్‌ను నిర్విరామంగా తెరకెక్కించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడట. మరి నిజంగానే అవతార్-2 సినిమాతో పుష్ప-2 దిగుతాడా లేదా అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు