Anand Devarakonda : అన్న కంటే ముందే దేవరకొండ తమ్ముడు.. ‘పుష్పకవిమానం’లో..

విజయ్ సక్సెస్ తర్వాత విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసాడు ఇండస్ట్రీలోకి. అన్న మాస్ సినిమాలు చేస్తూ వెళ్తుంటే తమ్ముడు క్లాస్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ

Anand Devarakonda : అన్న కంటే ముందే దేవరకొండ తమ్ముడు.. ‘పుష్పకవిమానం’లో..

Anand (2)

Anand Devarakonda :  ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ సినిమాతో మరోసారి గట్టిగా ఇండస్ట్రీని షేక్ చేయాలని పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నాడు. కరోనా వల్ల ఈ సినిమా లేట్ అయింది లేకపోతే ఈ పాటికే లైగర్ ని వెండితెర పై చూసేసి వాళ్ళం. విజయ్ సక్సెస్ తర్వాత విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేసాడు ఇండస్ట్రీలోకి. అన్న మాస్ సినిమాలు చేస్తూ వెళ్తుంటే తమ్ముడు క్లాస్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ కూల్ గా వెళ్తున్నాడు.

తన మొదటి సినిమా ‘దొరసాని’ తోటే మంచి విజయం సాధించి నటనా పరంగా కూడా తానేంటో నిరూపించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా ప్రమోషన్స్ కి అన్న పలుకుబడిని బాగానే వాడుకున్నాడు. కానీ సెకండ్ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ కి కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో ఓటిటి లోనే రిలీజ్ చేశారు. ఓటిటిలో కూడా మంచి క్లాస్ హిట్ ని అందుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత వరుసగా సినిమాలు లైనప్ చేసాడు. ఇప్పుడు తన మూడో సినిమా కూడా రిలీజ్ కి రెడీ చేసేసాడు.

Geetha Basraa : నాకు రెండు సార్లు గర్భస్రావం అయింది.. బాలీవుడ్ మాజీ నటి

తన అన్న విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ లోనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘పుష్పక విమానం’ అనే క్లాస్ టైటిల్ తో మరో క్లాస్ మూవీతో మన ముందుకి వస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాలో గీతశైని, శాన్వి మేఘన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దామోదర దర్శకత్వం వహిస్తుండగా విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ సినిమా నవంబర్ 12న థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో తన అన్న ‘లైగర్’ కంటే ముందే ‘పుష్పక విమానం’తో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.