Puvvada Ajay Kumar: అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి.. వై.ఎస్.షర్మిలపై పువ్వాడ ఫైర్ Puvvada Ajay Kumar crticises y.s.sharmila in khammam

Puvvada Ajay Kumar: అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి.. వై.ఎస్.షర్మిలపై పువ్వాడ ఫైర్

షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. గాలికి వచ్చి గాలికి పోయే పార్టీ మీది. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు.

Puvvada Ajay Kumar: అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి.. వై.ఎస్.షర్మిలపై పువ్వాడ ఫైర్

Puvvada Ajay Kumar: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని సూచించారు. ఖమ్మంలో శుక్రవారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పువ్వాడ మాట్లాడారు. ‘‘షర్మిలకు అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి. నేనేంటో చూపిస్తా. పాలేరులో పోటీ చేసినా మా దమ్మేంటో చూపిస్తాం. గాలికి వచ్చి గాలికి పోయే పార్టీ మీది. మీ నాన్న, అన్నలు డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారు.

Agnipath: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు మృతి

కేసీఆర్ మాకు ఉచితంగానే మంత్రి పదవులు ఇచ్చారు. సమాఖ్య పరిపాలకులను తరిమికొట్టాలి. ఆంధ్ర పాలకులు ఎన్నాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వై.ఎస్.కుటుంబం దోచుకోవాలని చూసింది. తెలంగాణ భూమి మీద మీకు ఏ హక్కు ఉంది? మీ తండ్రి, అన్న పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి. తూటాలు పేల్చిన ఘటన కళ్లముందే కనబడుతుంది. మొద్దు శీనును మీరే జైల్లో చంపారు’’ అని పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.

×