Tokyo Olympics : దేశమంతా ఒకటే మాట..సింధు ఆట, గోల్డ్ మెడల్ సాధించేనా ?

దేశమంతా ఒకటే మాట.. అదే సింధు ఆట. టోక్యో ఒలింపిక్స్‌లో తన జైత్ర యాత్ర కొనసాగిస్తున్న భారత్‌ స్టార్ షట్లర్‌ పీవీ సింధు.. పతకానికి మరో అడుగు దూరంలో నిలవడంతో మరోసారి దేశం చూపు తనవైపు పడింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడ‌ల్ గెలిచిన సింధుపై ఈసారి భారీ అంచనాలున్నాయి.

Tokyo Olympics : దేశమంతా ఒకటే మాట..సింధు ఆట, గోల్డ్ మెడల్ సాధించేనా ?

Sindhu (1)

PV Sindhu : దేశమంతా ఒకటే మాట.. అదే సింధు ఆట. టోక్యో ఒలింపిక్స్‌లో తన జైత్ర యాత్ర కొనసాగిస్తున్న భారత్‌ స్టార్ షట్లర్‌ పీవీ సింధు.. పతకానికి మరో అడుగు దూరంలో నిలవడంతో మరోసారి దేశం చూపు తనవైపు పడింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడ‌ల్ గెలిచిన సింధుపై ఈసారి భారీ అంచనాలున్నాయి. అమె కూడా ఈ సారి గోల్డ్‌ మెడల్‌నే టార్గెట్‌గా పెట్టుకుంది. దానికి తగ్గట్లుగానే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో దుమ్మురేపింది.

Read More : Gearless Scooter To Electric : మీ గేర్‌లెస్ స్కూటర్‌ను ఈ కిట్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేయొచ్చు!

క్వార్టర్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిని చిత్తు చేసి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో దేశం ఫోకస్‌ అంతా ఒక్కసారిగా సింధుపై పడింది. సెమీస్‌లో ఆమె గెలిచి తీరాలని అభిమానులతో పాటు యావత్‌ దేశం కోరుకుంటోంది. సింధుకు బెస్ట్‌ విషెస్‌ చెబుతూ సోషల్‌ మీడియా మారుమోగుతోంది. ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసిన ఒకటే చర్చ. సిందు కేక పుట్టించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్‌ చెబుతున్నారు అభిమానులు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి స్కూల్‌ విద్యార్థుల వరకు సింధు సెమీస్‌ అడ్డంకిని దాటాలని ప్రార్థిస్తున్నారు. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి దేశాన్ని సింధు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నారు.