Maharashtra : ఇది కార్పెట్ కాదు.. తారు రోడ్డు.. మహారాష్ట్రలో కొత్త రోడ్డు చూసి షాకవుతారు

మహారాష్ట్రలో రోడ్ల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియోలో అది రోడ్డా? కార్పెట్టా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇలాంటి నాణ్యత లేని రోడ్లు నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Maharashtra : ఇది కార్పెట్ కాదు.. తారు రోడ్డు.. మహారాష్ట్రలో కొత్త రోడ్డు చూసి షాకవుతారు

Maharashtra

Maharashtra News : మహారాష్ట్రకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఓ విలేజ్ లో రోడ్డుని కార్పెట్ లాగ చూపిస్తున్నారు అక్కడి జనం.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న ఈ వీడియో అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌ పొలిటికల్‌ పాఠాలు
మహారాష్ట్ర జల్నా జిల్లాలోని కర్జాత్ మరియు హస్త్ పోఖారి గ్రామంలో ఇటీవల ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY) కింద అధికారులు రోడ్ల నిర్మాణం చేపట్టారు. పాలిథిన్ తారుతో నిర్మించిన ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రోడ్డును కార్పెట్ విప్పినట్లు గ్రామస్తులు తీసి చూపిస్తున్న వీడియో జనాలను షాక్ కి గురిచేస్తోంది.

Ahmed Khabeer అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ ‘కాంట్రాక్టర్ల స్కామ్ కళ్లకు కడుతోంది’ అనే శీర్షికతో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు చాలామంది ఈ వీడియోపై మీమ్స్ పోస్టు చేశారు.

Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇలా నాణ్యతాలోపంతో రోడ్డు నిర్మాణం చేసారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిర్మాణం చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన తప్పిదం ప్రత్యక్షంగా కనిపిస్తుంటే దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో? ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.