Security Breach: ప్రధానికే సెక్యురిటీ ఇవ్వలేని సీఎం రాజీనామా చెయ్యాలి

ప్రధాని నరేంద్ర మోదీ భద్రత లోపంపై పంజాబ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

Security Breach: ప్రధానికే సెక్యురిటీ ఇవ్వలేని సీఎం రాజీనామా చెయ్యాలి

PM Modi

PM Modi’s Security Breach: ప్రధాని నరేంద్ర మోదీ భద్రత లోపంపై పంజాబ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు.

దేశ ప్రధానికే సునాయాస ప్రయాణాన్ని అందించలేనప్పుడు సామాన్య ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 10 కి.మీ దూరంలో ఉన్నపుడు ప్రధాని సెక్యురిటీ విషయంలో అశ్రద్ధ వహించారని, పదవిలో కొనసాగే హక్కు ముఖ్యమంత్రికి లేదని, సీఎం వెంటనే పదవీ విరమణ చేయాలని అమరీందర్ సింగ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రక్షణ కల్పించే ప్రోటోకాల్‌ని కావాలనే పంజాబ్ ప్రభుత్వం పాటించలేదని విమర్శలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు పంజాబ్ పోలీసులు ఆందోళనకారులను అనుమతించారని విమర్శించారు.ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ సీఎం కూడా స్పందించారు.

ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని, 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చారని, అదే సమస్యకు కారణమైందని అన్నారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్టు సీఎం వెల్లడించారు.