‘రాధే శ్యామ్’.. హిందీ మ్యూజిక్ కంపోజర్స్ వీళ్లే..

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత మందిస్తున్న సంగతి తెలిసిందే..

‘రాధే శ్యామ్’.. హిందీ మ్యూజిక్ కంపోజర్స్ వీళ్లే..

Radhe Shyam Music Composers: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపికృష్ణా మూవీస్ డా.యూవీ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం.. ‘రాధే శ్యామ్’..

70 కాలంలో రోమ్ బ్యాక్ డ్రాప్‌లో రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యనున్నట్లు తెలుపుతూ.. ప్రీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఫిబ్రవరి 14 కోసం వెయిట్ చేస్తుండగా.. 11వ తేదీ మధ్యాహ్నం టీమ్ మరో అప్‌డేట్ ఇచ్చింది.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత మందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సాంగ్స్, ఆర్ఆర్ కంపోజ్ చెయ్యనున్నారు ఈ సంగీత ద్వయం.