Rahul Gandhi: నల్ల దుస్తుల్లో పార్లమెంటులో కాంగ్రెస్ నేతల నిరసన

ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూట్ లో పార్టీ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేశారు.

Rahul Gandhi: నల్ల దుస్తుల్లో పార్లమెంటులో కాంగ్రెస్ నేతల నిరసన

 

 

Rahul Gandhi: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూట్ లో పార్టీ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేశారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పార్టీ దేశవ్యాప్త నిరసనలను నిర్వహిస్తుండగా, “ద్రవ్యోల్బణం పరిమితికి మించి పెరిగింది. ప్రభుత్వం దాని గురించి ఏదైనా చేయాల్సి ఉంది. అందుకే మా పోరాటం” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు.

అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, GST, ED చర్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసనను చేపట్టారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రసంగిస్తూ ‘భారతదేశం ప్రజాస్వామ్య చనిపోయిందంటూ’ ఆరోపించారు. మీడియా సమావేశంలో తన చేతికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు.

మోదీ ప్రభుత్వం అన్ని కేంద్ర ఏజెన్సీలను నియంత్రిస్తోందనే విధంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read Also: ప్ర‌శ్నిస్తే ‘రాజా’కు కోపం వ‌స్తుంది: రాహుల్ గాంధీ

“హిట్లర్ కూడా ఎన్నికలలో గెలిచాడు. అతను దానిని ఎలా ఉపయోగించాడు? జర్మనీ అన్ని సంస్థలపై నియంత్రణ తెచ్చుకున్నాడు. నాకు మొత్తం వ్యవస్థను ఇవ్వండి, అప్పుడు ఎన్నికలు ఎలా గెలుస్తామో మీకు చూపిస్తాను” అని వయనాడ్ ఎంపీ అన్నారు.

“ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. దాదాపు శతాబ్దం క్రితం భారతదేశం నిర్మించుకున్నదంతా మీ కళ్ల ముందు ధ్వంసం అవుతుంది. నియంతృత్వానికి ఎదురుతిరిగితే వారిపై దాడి చేస్తారు. అరెస్టు చేస్తారు.. జైలులో పెడతారు.. కొడతారు కూడా’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

“నా కుటుంబం తమ జీవితాలను త్యాగం చేసింది, అదే సిద్ధాంతం కోసం మేం పోరాడుతున్నందున ఇది మా బాధ్యత. హిందువులు-ముస్లింలు ఒకరిపై ఒకరు పరస్పరం ఘర్షణకు దిగినప్పుడు, దళితులు హత్యకు గురైనప్పుడు, మహిళపై దాడి జరిగినప్పుడు అది మాకు బాధ కలిగిస్తుంది. అందుకే పోరాడుతూనే ఉన్నాం” అతను జోడించాడు.

‘మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ బీజేపీకి కౌంటర్ వేశారు.

వర్షం కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కొనసాగించారు. తమ ప్రధాన కార్యాలయాన్ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నివాసాలను చుట్టుముట్టారని పార్టీ బుధవారం ఆరోపించింది.