మీ విజన్ ఇప్పుడు అర్థమైంది…మోడీకి థ్యాంక్స్ చెప్పిన రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 11:54 AM IST
మీ విజన్ ఇప్పుడు అర్థమైంది…మోడీకి థ్యాంక్స్ చెప్పిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ పథకం విజన్ ను,విశిష్ఠతను అర్థం చేసుకుని, 40 వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి అదనంగా కేటాయించడంపై మోడీకి రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. మోడీ యూటర్న్ ఆన్ MNGREA అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా రాహుల్ తన ట్వీట్ లో ఉంచారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఈ స్కీమ్ గురించి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…MNGREA పథకం అనేది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ యొక్క జీవిస్తున్న స్మారకం. 60ఏళ్ల తర్వాత కూడా కాలువలను తవ్వేందుకు కాంగ్రెస్ మనుషులను పంపిస్తోందని మోడీ అన్నారు. ఇటీవల ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నరేగా పథకానికి 40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. 

దీంతో నరేగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు ఈ కేటాయింపులు మేలు చేయనున్నాయి. నరేగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. యూపిఏ హయాంలో మన్‌రెగా పథకాన్ని ప్రారంభించారు.

Read:  జనం చేతుల్లో డబ్బులు పెట్టండి.. విమర్శలకు సమయం కాదు.. : రాహుల్ గాంధీ