Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

భారత్-చైనా సరిహద్దులోని లడఖ్ దగ్గర ఉన్న పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైఖరిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

Rahul Gandhi

Rahul Gandhi: భారత్-చైనా సరిహద్దులోని లడఖ్ దగ్గర ఉన్న పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైఖరిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో మరో చర్చకు తావులేదని, దేశాన్ని రక్షించాలని మోదీని కోరారు.

Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం

ఈ మేరకు రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ అంశంపై స్పందించారు. ‘‘భారత జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల్లో చర్చకు తావులేదు. పిరికితనం, విధేయతతో కూడిన స్పందన అవసరం లేదు. ప్రధాని దేశాన్ని సంరక్షించాలి’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పాంగాంగ్ సరస్సుపై ఇప్పటికే ఒక బ్రిడ్జి నిర్మించిన చైనా, ఇప్పుడు రెండో బ్రిడ్జిని కూడా నిర్మిస్తోంది. పైగా ఇది మొదటి బ్రిడ్జి కంటే మరింత పెద్దది. ఈ విషయంలో కేంద్రం స్పందించింది. చైనా నిర్మిస్తున్న బ్రిడ్జి విషయంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కేంద్రం పేర్కొంది. దీనిపై కూడా రాహుల్ విమర్శించారు. ‘

Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో..

‘చైనా మొదటి బ్రిడ్జి నిర్మించింది. కేంద్రం పర్యవేక్షిస్తున్నామని చెప్పింది. ఇప్పుడు రెండో బ్రిడ్జి కూడా నిర్మిస్తోంది. మళ్లీ పర్యవేక్షిస్తున్నామని చెప్పింది’’ అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. 2020 నుంచి చైనా-భారత్ మధ్య, సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ అంశంపై ఇరు దేశాలు 15 సార్లు చర్చలు జరిపాయి.