Rahul quit on Modi comments: మోదీ వారసత్వ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించిన రాహుల్ గాంధీ

భారత తొలి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉంటున్నాయి. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా బయటి వ్యక్తులు వచ్చినప్పటికీ అంతిమంగా మళ్లీ గాంధీ కుటుంబమే పార్టీకి నాయకత్వం వహించాల్సి వస్తోంది. ఈ విషయమై చాలా కాలంగా కాంగ్రెస్ అనేక విమర్శల్ని ఎదుర్కుంటోంది. దేశంలో అన్ని పార్టీల్లోనూ ఈ విధానం కొనసాగుతోంది. బీజేపీ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ మంది వారసులు బీజేపీ నుంచే పోటీ చేశారు.

Rahul quit on Modi comments: మోదీ వారసత్వ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించిన రాహుల్ గాంధీ

Rahul quit on Modi comments: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని చేసిన వారసత్వ వ్యాఖ్యలపై స్పందించనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ వారసత్వంపై ఆరోపణలు చేశారు. దీనిపై మీ సమాధానం ఏంటి?’’ అని రాహుల్‭ను ప్రశ్నించగా.. ‘‘నేను దీనిపై స్పందించను. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’’ అని అన్నారు. అనంతరం తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

స్వాతంత్ర్యం దినోత్సవ ప్రసంగంలో పేరు ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి రెండు సమస్యలు చెదపురుగులా తయారయ్యాయని, జనజీవనం నుంచి వాటిని తరిమేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ రెండు సమస్యల్లో ఒకటి అవినీతి కాగా, మరొకటి వారసత్వమని మోదీ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాన్ని కాంగ్రెస్ లక్ష్యంగానే మోదీ చేశారని వేరే చెప్పనక్కర్లేదు. 2004-2014 వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత తొలి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉంటున్నాయి. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా బయటి వ్యక్తులు వచ్చినప్పటికీ అంతిమంగా మళ్లీ గాంధీ కుటుంబమే పార్టీకి నాయకత్వం వహించాల్సి వస్తోంది. ఈ విషయమై చాలా కాలంగా కాంగ్రెస్ అనేక విమర్శల్ని ఎదుర్కుంటోంది. అయితే వారసత్వ రాజకీయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు. దేశంలో అన్ని పార్టీల్లోనూ ఈ విధానం కొనసాగుతోంది. బీజేపీ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ మంది వారసులు బీజేపీ నుంచే పోటీ చేశారు.

#IndependenceDay: ఈసారి ప్రసంగంలో టెలిప్రాంప్టర్ కాకుండా పేపర్ నోట్స్ వాడిన మోదీ