Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్లు రద్దు

Trains Cancelled

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. తెలుగు రాష్ట్రాల మీదుగా(విశాఖపట్నం, హైదరాబాద్‌తో) వెళ్లే పలు రైళ్లతో పాటు ఇతర మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఏ ఏ రూట్లలో ఏ రైళ్లు రద్దయ్యాయి, ఎప్పటివరకు రద్దు చేశారంటే..

రద్దు చేసిన రైళ్లు ఇవే..
విశాఖపట్నం-కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకు

కాచిగూడ-విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకు

భువనేశ్వర్‌-పుణే (02882) జూన్‌ 1 నుంచి 8 వరకు

పుణే-భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకు

కడప-విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకు

విశాఖపట్నం-కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకు

విశాఖపట్నం-లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకు

లింగంపల్లి-విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకు

రద్దు అయిన 8 రైళ్లలో ఆరు తెలుగు రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. మిగతా రెండింటిలో భువనేశ్వర్-పుణె రైళ్లు ఉన్నాయి. జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు.