Tokyo Olympics : సిల్వర్ గెలిచిన చానుకు రైల్వే శాఖ ఆఫర్.. రూ.2 కోట్ల నగదు బహుమతి

ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు భారత్ నుంచి ప్రశంసల వెల్లువే కాదు కోట్లాది రూపాయలు బహుమతులుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత రైల్వే శాఖ ఛానుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. మెడల్ గెలిచిన అనంతరం చాను భారత్ కు తిరిగి వచ్చాక ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను కలిసారు. ఈ సందర్భంగా మీరాబాయిని ఘనంగా స‌న్మానించారు. రూ.2 కోట్ల న‌గ‌దు, ఈశాన్య రైల్వేలో ప్ర‌మోష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Tokyo Olympics : సిల్వర్ గెలిచిన చానుకు రైల్వే శాఖ ఆఫర్.. రూ.2 కోట్ల నగదు బహుమతి

Tokyo Olympics

Railway Minister Announces Rs 2 Crore Reward For Mirabai Chanu : ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు భారత్ నుంచి ప్రశంసల వెల్లువే కాదు కోట్లాది రూపాయలు బహుమతులుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత రైల్వే శాఖ ఛానుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. మెడల్ గెలిచిన అనంతరం చాను భారత్ కు తిరిగి వచ్చారు.అనంతరం ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను కలిసారు. ఈ సందర్భంగా మీరాబాయిని ఘనంగా స‌న్మానించారు. ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం రూ.2 కోట్ల న‌గ‌దు, ఈశాన్య రైల్వేలో ప్ర‌మోష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మీరాబాయి త‌న నైపుణ్యం, క‌ఠోర శ్ర‌మ‌, మొక్క‌వోని దీక్ష‌తో కోట్లాది మంది భారతీయుల‌లో స్ఫూర్తి నింపింద‌ని ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణ‌వ్ అన్నారు. ఆమెను క‌ల‌వ‌డం, స‌న్మానించ‌డం సంతోషించాల్సిన విషయం అని ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ గా ప్ర‌మోట్ చేశారు. ఒలింపిక్ క్రీడల్లో భారత పతకాల పట్టికకు మణిపూర్ కు చెందిన మీరాభాయి చాను సిల్వర్ మెడల్ సాధించి శ్రీకారం చుట్టారు. 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన చాను, సోమవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.

కాగా భారత్ వచ్చాక మీరాభాయి క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడా సహాయ మంత్రి నిషిత్ సత్య, కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, సర్బానంద సోనోవాల్ లను కలిసారు. ఈ సందర్భంగా మీరా కూడా తన సంతోషాన్ని పంచుకున్నారు.”ఒలింపిక్స్ లో మెడల్ గెలవాలనే నా కల నిజమైంది. ఈ పతకాన్ని భారత ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం సహకరించకపోతే, ఆమె కల ఎప్పటికీ నెరవేరదని..నా కోసం..నా గెలుపు కోసం ప్రార్థించిన నన్ను ప్రోత్సహించిన వారందరికీ ఈ పతకాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు.

అలాగే మణిపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్ మీరాబాయి చానుకు బహుమతి ప్రకటించారు. రాష్ట్ర పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా నియమించనున్నారు. అలాగే కోటి రూపాయల బహుమతిని కూడా అందించనున్నారు.