Special Train Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 24 స్పెషల్ ట్రైన్స్

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Special Train Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 24 స్పెషల్ ట్రైన్స్

Special Train Services

Special Train Services : దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఈ రైళ్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

స్పెషల్ రైళ్ల వివరాలు:
Train No 02831: విశాఖపట్నం నుంచి లింగంపల్లి ట్రైన్(డైలీ) జులై 01 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 2832: లింగంపల్లి-విశాఖపట్నం ట్రైన్(డైలీ) జులై 02 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 07488: విశాఖ-కడప మధ్య నడిచే ట్రైన్(డైలీ) జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 07487: కడప-విశాఖ మధ్య నడిచే ఈ ట్రైన్ జులై 1 నుంచి అందుబాటులోకి వస్తుంది.
Train No 08479: భువనేశ్వర్ నుంచి తిరుపతి మధ్య ప్రతీ శనివారం నడిచే ఈ వీక్లీ ట్రైన్ జులై 3 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 08480: తిరుపతి-భువనేశ్వర్ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ఈ స్పెషల్ ట్రైన్ జులై 04 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02851: విశాఖపట్నం-హెచ్.నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు(సోమవారం, శుక్రవారం) నడిచే ఈ ట్రైన్ జులై 2 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02852: హెచ్.నిజాముద్దీన్-విశాఖపట్నం మధ్య వారానికి రెండు సార్లు(బుధవారం, ఆదివారం) నడిచే ట్రైన్ జులై 4 నుంచి నడపనున్నారు.
Train No 02869: విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ మధ్య వారానికి ఒక సారి(సోమ) నడిచే ట్రైన్ జులై 5 నుంచి అందుబాటులోకి రానుంది.
Train No 02870: చెన్నై సెంట్రల్-విశాఖపట్నం మధ్య వారానికి ఒక సారి(మంగళవారం) నడిచే ట్రైన్ ఈ జులై 6 నుంచి అందుబాటులోకి రానుంది.

వీటిలో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనుండగా మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు రైళ్లు వారంలో రెండు సార్లు నడవనున్నాయి. ఈ రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడ్ సర్వీసులుగానే నడవనున్నాయి. వీటిలో ప్రయాణించాలంటే ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తర్వాత ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజుల క్రితం నాలుగు లక్షల వరకు నమోదైన కరోనా కేసులు కాస్త.. ఇప్పుడు 50వేల వరకు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తేయగా.. మరికొన్ని సాధారణ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి.

 

Trains