IRCTC : గుడ్ న్యూస్ ..30 శాతం తగ్గనున్న భారత్ గౌరవ్ రైలు చార్జీలు..
ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్ింది. భారత్ గౌరవ్ రైలు చార్జీలు.. దాదాపు 30 శాతం తగ్గనున్నాయి.

IRCTC : ఈరోజుల్లో ఏ ధరలైనా పెరగటమే గానీ తగ్గేదేలేదంటున్నాయి. బస్సు చార్జీల నుంచి రైలు చార్జీల వరకు అన్నీ పెరగటమే. ఆఖరికి ప్లాట్ ఫామ్ టికెట్ కూడా పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ‘భారత్ గౌరవ్ రైలు’ టికెట్ చార్జీలను తగ్గిస్తోంది IRCTC. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ సరిగాలేకుండా పోయింది. దీంతో (ఆక్యుపెన్సీ రేటు) టికెట్ ఛార్జీలను 20 నుంచి 30 శాతం వరకూ తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
అలాగే కనీసం రెండు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా IRCTC తప్పనిసరిగా రద్దు చేసుకునే పరిస్థితి నెలకొందని రైల్వే అధికారి తెలిపారు. ఈ రైళ్లతో పోలిస్తే భారత్ దర్శన్ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ గౌరవ్ రైళ్లలో ఏసీ 3 టైర్ ఛార్జీలను తగ్గించే యోచనలో ఉంది IRCTC. దీనికి ఆమోదం కూడా లభించినట్లుగా తెలుస్తోంది. IRCTC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఈ ప్రత్యేక రైలు ఛార్జీని తగ్గించేందుకు రైల్వే శాఖ నుంచి IRCTC ఆమోదం లభించిన తర్వాత ఈ ప్రత్యేక రైలు సర్వీస్ ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. స్వదేశ్ దర్శన్ పథకంలోని రామాయణ సర్క్యూట్లో ఈ రైలు యొక్క ఒక సర్వీస్‌ను మాత్రమే నిర్వహించడంలో ఐఆర్సీటీసీ ఇప్పటివరకు విజయవంతమైంది. భారత్ గౌరవ్ టూరిజం రైలులో 18 రోజుల ప్యాకేజీకి AC-III తరగతి ధర రూ. 62,000.
భారతదేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల విశేషాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో 2021లో ఈ భారత్ గౌరవ్ రైళ్లను రైల్వేశాఖ ప్రారంభించింది. రామాయణ్ సర్క్యూట్ కింద ఢిల్లీలోని సఫ్దార్జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు.. పలు చారిత్రక ప్రదేశాలను చుట్టుముట్టి నేపాల్‌కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల పాటు సాగే ఈ ప్రయాణానికి 3 టైర్ ఏసీ టికెట్ ధర రూ.62వేలుగా ఉంది.
ప్రారంభంలో ఈ రైలుకు మంచి స్పందనే వచ్చింది. కానీ రాను రాను తగ్గిపోయింది. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో పాటు 15ఏళ్ల నాటి ఐసీఎఫ్ కోచ్‌లతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారనే అభిప్రాయాలు ప్రయాణీకుల నుంచి వస్తున్నాయి. దీంతో వేరే దారి లేక..నష్టాలను కాస్తైనా భర్తీ చేయాలి అంటే టికెట్ ధరలను తగ్గించక తప్పని పరిస్థితి. దీంతో IRCTC ఈ దిశగా యోచిస్తోంది.