హైదరాబాద్ లో భారీ వర్షం, చల్లబడిన వాతావరణం, సేదతీరిన జనం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఆదివారం(మే

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 08:15 AM IST
హైదరాబాద్ లో భారీ వర్షం, చల్లబడిన వాతావరణం, సేదతీరిన జనం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఆదివారం(మే

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్ ప్రాంతాల్లో వాన జోరుగా కురుస్తోంది. పలు చోట్ల ఈదరుగాలులకు చెట్లు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సమాచారంతో జీహెచ్ఎంసీ ఇప్పటికే అప్రమత్తమైంది. ఆదివారం(మే 31,2020) మధ్యాహ్నం 1.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. వాన రాకతో వాతావరణం చల్లబడింది. అప్పటివరకు ఉక్కపోతతో విలవిలలాడిన నగరవాసులు వర్షం కురవడంతో సేద తీరారు. అదే సమయంలో నగరవాసుల్లో కరోనా భయం మరింత పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

నిప్పులు కురిపిస్తున్న భానుడు:
కొన్ని రోజులుగా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు భారీ పెరిగాయి. ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడికి తట్టుకోలేక జనం విలవిలలాడిపోతున్నారు. దీనికి తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సూర్య ప్రతాపంతో విలవిలలాడిన నగరవాసులు ఈ వర్షంతో చల్లబడ్డారు. కాగా అసలే కరోనా భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో వానలు కురవడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

ముందుగానే వచ్చేసిన నైరుతి:
మరోవైపు అనుకున్న సమయానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. శనివారం(మే 30,2020) సాయంత్రానికి కేరళ తీరాన్ని తాకాయి. భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం జూన్‌ 1 నాటికి రుతుపవనాలు రావాల్సి ఉంది. కదలికలను అనుకూలమైన వాతావరణం ఉండడం, అందుకు తోడు అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడం లాంటి కారణాల వల్ల రెండురోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సగటు వర్షపాతం కురుస్తుందని, 96 నుంచి 100శాతం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అల్పపీడనం ఏర్పడే అవకాశం:
ఈ ఏడాది ముందస్తు రాకతో వానాకాలం పొలం పనులు చకచకా జరుగుతాయపని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఆ దిశగా క్షేత్రస్థాయి కార్యా చరణను ప్రకటించేందుకు సిద్దమవుతోంది. ఇదిలా ఉండగా రానున్న 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దిdవులు, కోమోరిన్‌ ప్రాంతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రం, తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి మరో 48 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు ధృవీకరించారు. 

మోస్తరు నుంచి భారీ వర్ష సూచన:
జూన్‌ 1 నాటికి చత్తీస్‌గడ్‌ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. తెలంగాణ, రాయలసీమ, కర్నాటక, కేరళ మీదుగా ఈ ఉపరితల ద్రోణి ప్రభావం ఉంటుంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల పాటు వడగాలుల తీవ్రత కూడా కొనసాగనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.