Hyderabad Rains : ఇవాళ సాయంత్రం 6 దాటాక.. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు శనివారం సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

Hyderabad Rains : ఇవాళ సాయంత్రం 6 దాటాక.. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!

Rains Likely In Hyderabad City After 6.00pm, Northern Parts High Chance Again

Hyderabad Rains : నగరవాసులకు అలర్ట్.. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు శనివారం (జూలై 2) సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. హైద‌రాబాద్ ఉత్త‌ర భాగంలోనే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రవ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షం కురిసిన సంగతి తెలిసిందే.

నగరవ్యాప్తంగా జూలై 6వ తేదీ వ‌ర‌కు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జూన్‌లో‌ న‌గ‌రంలో 84.6 మి.మీ మేర వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అప్పుడు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 109. 2 మి.మీగా నమోదైంది. రాబోయే రోజుల్లో న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. 7.5 మి.మీ. నుంచి 15 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం కురిసే అవ‌కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, రాంనగర్, లక్డీకాపూల్‌, చార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, గోల్కొండ, లంగర్‌ హౌస్‌, సికింద్రాబాద్‌, పారడైజ్‌, బేగంపేట, కోటి, అమీర్‌పేట, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.

ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. వర్షంలో సిబ్బంది పనితీరుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అభినందిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also : Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు