Raja Singh: సాయి పల్లవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: రాజా సింగ్ Raja Singh criticises sai pallavi over her comments

Raja Singh: సాయి పల్లవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: రాజా సింగ్

కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్‌పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం.

Raja Singh: సాయి పల్లవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: రాజా సింగ్

Raja Singh: హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోపాటు పలు అంశాలపై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంపై హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ‘‘కొందరు నటులు, డైరెక్టర్లు పాపులర్ అవ్వడం కోసమే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకోసమే కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైంది.

Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్‌పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తెలంగాణ, ఏపీలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదు చేయాలని పిలుపునిస్తున్నా. ఒక్క నటుడ్ని అరెస్టు చేస్తే హిందువుల జోలికి ఎవరూ రారు. నటులు, దర్శకులకు ఇస్లాంపై కామెంట్స్ చేసే ధైర్యం ఉందా? ఇప్పుడున్న హిందువులు శివాజీలాంటి వాళ్లు. హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే భౌతిక దాడులు జరుగుతాయి’’ అని రాజా సింగ్ అన్నారు.

×