TS Congress: రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. దూకుడు పెంచిన కాంగ్రెస్

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.

TS Congress: రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. దూకుడు పెంచిన కాంగ్రెస్

TS Congress: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. రాజీనామాకు ముందువరకు రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా కాంగ్రెస్ అగ్రనాయకత్వం విశ్వప్రయత్నాలు చేసింది. అయినా కాంగ్రెస్ ను వీడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ దూకుడును పెంచింది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డిపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ చేజారకుండా చర్యలు వేగవంతం చేసింది.

Rajagopal Reddy : తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ప్రత్యేక వ్యూహ ప్రచార కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కన్వీనర్ గా ఉండే ఈ కమిటీలో నేతలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, ఈరవత్రి అనిల్ లను సభ్యులుగా నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్య ఠాగూర్ ప్రకటించారు. అయితే త్వరలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలపడంతో.. మునుగోడులో ఉపఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం అన్నిచర్యలు చేపడుతోంది.

Rajagopal Reddy Resign : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉండేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికితోడు ఉపఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో అభ్యర్థిని సైతం ముందుగానే ప్రటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిట్టింగ్ స్థానమైన మునుగోడులో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ఆ పార్టీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు.