Rajasthan: రాజస్థాన్‌లో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. వెల్లడించిన సీఎం అశోక్ గెహ్లాట్.. 50కి చేరనున్న జిల్లాల సంఖ్య

ప్రస్తుతం రాజస్థాన్‌లో 33 జిల్లాలున్నాయి. అయితే, వీటిలో జైపూర్, జోధ్‌పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్లడించారు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో 19 కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాజస్థాన్‌లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్లడించారు. రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 33 జిల్లాలున్నాయి.

Covid-19: మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ .. ఒకే రోజు 800 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో అధికం

అయితే, వీటిలో జైపూర్, జోధ్‌పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. చాలా కాలంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల నుంచి అనేక వినతులు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు అశోక్ గెహ్లాట్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు, వారి నుంచి నివేదిక అందినట్లు సీఎం చెప్పారు. దీని ఆధారంగా మరో 19 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.Rajasthan

అలాగే మరో మూడు డివిజన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో డివిజన్ల సంఖ్య పదికి చేరబోతుంది. త్వరలో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జిల్లాల ఏర్పాటు స్థానిక రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు