Helicopter Sale :రూ.30 కోట్ల హెలికాప్టర్ పై సర్కార్ డిస్కౌంట్ Rs.26 కోట్లు

RS.30 కోట్లకు కొన్న ఓ హెలికాఫ్టర్ ని రూ.26 కోట్ల డిస్కౌంట్ తో రూ.4 కోట్లకు రాజస్థాన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

Helicopter Sale :రూ.30 కోట్ల హెలికాప్టర్ పై సర్కార్ డిస్కౌంట్  Rs.26 కోట్లు

Rajasthan Govt Helicopter Sale

Rajasthan govt twin-engine A109E power helicopter Sale : రాజస్థాన్ ప్రభుత్వం అన్ని భద్రతా సదుపాయాలు ఉన్న అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన హెలికాఫ్టర్ ని కేవలం రూ.4.5 కోట్లకే అమ్మకానికి పెట్టింది. రూ.30 కోట్లకు ప్రభుత్వం అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది. 2005లో వసుంధరా రాజే రాజస్థాన్ సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. సీఎం అధికారిక కార్యక్రమాలకు ఈ హెలికాఫ్టర్ ని వినియోగించేవారు.

ఈ క్రమంలో 2011లో అశోక్ గెహ్లాట్ సీఎం అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళుతున్న సయమంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత దీన్ని వినియోగించకుండా అప్పటి నుంచి గోడౌన్ కే పరిమితమైంది. ఈ క్రమంలో దీన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ హెలికాప్టర్ అమ్మటానికి ప్రభుత్వం పలుమార్లు టెండర్లను పిలిచినా ఎవ్వరూ దీన్ని కొనటానికి ఆసక్తి చూపించటంలేదు.అలా ఇప్పటి వరకూ ప్రభుత్వం దీన్ని అమ్మటానికి 12 సార్లు టెండర్లను పిలిచింది. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఏకంగా నష్టమొచ్చినా ఫరవేదని భావించిన ప్రభుత్వం ఈ హెలికాప్టర్ పై రూ. 26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ… కేవలం రూ. 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ భారీ డిస్కౌంట్ కు స్పందించి ఈ సారి అయినా ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తారా? లేదా? వేచి చూడాలి.

సీఎం గెహ్లాట్ ప్రయాణిస్తుండగా మధ్యలో సాంకేతిక కారణాలతో హెలికాఫ్టర్ ని ఇద్దరు పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయగలిగారు. ఈక్రమంలో సీఎం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్‌ను ‘జిన్‌క్సెడ్’ గా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి నుండి ఏ సీఎం కూడా ఈ హెలికాప్టర్‌లో ప్రయాణించలేదు. దీంతో ఈ ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ స్టేట్ హ్యాంగర్ వద్ద తుప్పుపట్టిపోతోంది.దీంతో చీఫ్ సెక్రటరీ నిరంజన్ ఆర్య ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అగస్టా హెలికాప్టర్‌ను తిరిగి వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. విషయంలో తాజా ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ అగస్టా హెలికాప్టర్ ప్రస్తుత స్థితి..భవిష్యత్తులో ఉపయోగం సాధ్యాసాధ్యాలపై అధికారులతో వివరంగా చర్చించినట్లు సమాచారం. చివరగా..సమావేశంలో అగస్టా హెలికాప్టర్‌ని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

రిజర్వ్ ధర నుండి ప్లస్-మైనస్ రేటుకు చాపర్‌ను విక్రయించడానికి టెండర్లను ఆహ్వానించాలని పౌర విమానయాన శాఖను ఆదేశించారు. కానీ ‘జిన్‌క్సెడ్’ గా పరిగణించబడే ఛాపర్ మరియు దాదాపు 10 సంవత్సరాల పాటు ఏ CM కూడా ప్రయాణించలేదు. స్టేట్ హ్యాంగర్ వద్ద ఈ అగస్టా హెలికాప్టర్ అమ్మకానికి సిద్దంగా ఉన్నా కొనటానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రావటంలేదు.