లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

లీవ్ కావాలంటే కోరిక తీర్చమంటూ ప్రభుత్వ అధికారి వెర్రివేషాలు..ఉతికారేసిన ఉద్యోగులు

Updated On - 4:47 pm, Wed, 20 January 21

Rajasthan JMC sanitation inspector sexual favours : ఉద్యోగాలు చేసే ఆడవారంటే కొంతమంది ఉన్నతాధికారులకు చులకన. ఇష్టమొచ్చినట్లుగా వాగుతుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. మహిళా ఉద్యోగులకు లీవులు కావాలన్నా..లోన్లు కావాలన్నా..తమ కోరిక తీర్చాలని డిమాండ్ చేసే ఉన్నతాధికారులు ఉన్నారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. మహిళలపై వేధింపులు ప్రైవేటు సంస్థలోలనే కాదు ప్రభుత్వ సంస్థల్లో కూడా ఉన్నాయనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే మహిళా ఉద్యోగులు అటువంటి వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ వేధింపులను భరించలేక..ఉద్యోగం వదులుకోలేక మానసికంగా నలిగిపోతుంటారు. కానీ కొంతమంది ఆ వేధింపుల్ని మౌనంగా భరిస్తుంటే..కొంతమంది ప్రశ్నిస్తారు.

మునిసిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఆగడాలు
అటువంటి ఘటనే జరిగింది రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ లోని మునిసిపల్ కార్పొరేషన్ లో. ఓ మహిళా ఉద్యోగిని తన తమ్ముడికి చావుబతుకుల్లో ఐసీయూలో ఉన్నాడనీ కాబట్టి తాను ఆఫీసుకురాలేనని తనకు సెలవు కావాలని ఉన్నతాధికారిని ఫోన్ చేసి అడిగింది. దానికా అధికారి ‘‘నీకు లీవ్ తప్పకుండా ఇస్తాను..అలాగే నీ తమ్ముడు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా నేనే ఇస్తాను..కానీ ఓ కండిషన్’’ తోనే అని అన్నాడు. దానికామె ‘ఏమిటా కండిషన్’ అని అడిగింది.

లీవు కావాలంటే బెడ్ రూమ్ కు రావాలి..
నీకు లీవు ఇవ్వాలంటే నా కోరిక తీర్చాలి..నా బెడ్ రూమ్ కు రావాలి అన్నాడు. దానికామెకు కోపం తారాస్థాయికి చేరింది. ‘ లీవు ఇవ్వటానికి నువ్వు అంత నీచానికి దిగజారావు..నాకు మాత్రం అంత దౌర్భాగ్యం పట్టలేదు’ అని ఘాటుగా సమాధానం చెప్పి ఫోన్ టాపాలున పెట్టేసింది. దీంతో గురుడికి దిమ్మ తిరిగిపోయింది..ఆ తరువాత వాడి ఒళ్లు హూనం అయిపోయింది..దాంతో గురుడికి బొమ్మ కూడా కనిపించింది..! ఆకాశంలో చుక్కలు కూడా కనిపించాయి..!!

సోదరుడు చావుబతుకులతో ఉన్న సందర్భాన్ని వాడుకోవాలనుకున్న అధికారి
జోధ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తన సోదరుడు ఆసుపత్రి ఐసీయూలో చావు బతుకుల్లో ఉన్నాడని తాను ఆఫీసుకు రాలేనని, లీవు కావాలని తనపై అధికారికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో లీవ్ సాంక్షన్ చేయాలంటే తన కోరిక తీర్చాలని కండిషన్ పెట్టాడు. ఆ మాటలకు ఆమె షాక్ అయ్యింది. బాధతోను కోపంతోను..లీవు కోసం అమ్ముడు పోవటానికి సిద్ధంగా లేనని చెప్పి ఫోన్ పెట్టేసింది. కానీ అక్కడ ఆమె ఓ మంచి పనిచేసింది. ఆ అధికారి మాట్లాడిన మాటల్ని ఫోన్ లో రికార్డు చేసింది.

ఆతరువాత ఆమె సోదరుడు హాస్పిటల్ లోనే మరణించాడు. ఇటు తోడబుట్టినవాడు చనిపోవటం..మరోవైపు తనను వేధించిన అధికారి మాటలతో తీవ్ర ఆవేదనకు గురైందామె. ఈ విషయాన్ని తన తోటి ఉద్యోగులకు చెప్పుకుని వేదన చెందింది. రికార్డు చేసిన అధికారి మాటల్ని వినిపించింది. దీంతో ఆమెకు తోటి ఉద్యోగులంతా అండగా నిలిచారు. అతనికి ఇది కొత్తకాదు..ఎలాగైనా బుద్ది చెప్పాలని అందరూ కలిసి అనుకున్నారు. ఆఫీసరు రూము వద్దకు వెళ్లి..నీకు అక్కా చెల్లెళ్లు లేరా? సార్..ఇలా మమ్మల్నెందుకు వేధిస్తారు అంటూ ముందూ వెనుకా ఆలోచించకుండా ‘ఉతికి ఆరేశారు’. దీంతో సదరు అధికారి ఒళ్లు హూనం అయిపోయింది. బైటకు చెప్పుకోలేక..గిజగిజలాడిపోయాడు.

వైరల్ అయిన అధికారి వేధింపుల కాల్..
లీవు కావాలంటే తనతో రిలేషన్ పెట్టుకోవాలని అంటూ పదేపదే ఒత్తి పలుకుతున్న అధికారి మాటలను ఆమె రికార్డు చేయగా.. ఆ ఆడియో కాల్ వైరల్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన జోధ్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ (నార్త్) రోహితాశ్వా సింగ్ తోమర్ ధర్మేంద్ర గెహ్లాట్ అనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేశారు. పోలీసులు అతినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు ధర్మేంద్రను మహిళా ఉద్యోగులు చితక బాదుతున్న వీడియో కూడా ఇప్పుడు రాష్ట్రమంతా వైరల్ గా మారింది. ఈ మొత్తం తతంగంపై విచారణకు ఆదేశించారు.

కొన్నేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్న గెహ్లాట్..
వితంతువైన సదరు మహిళా ఉద్యోగినిని గత కొన్నేళ్లుగా ధర్మేంద్ర గెహ్లాట్ వేధిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆదివారం తన సోదరుడికి ఆరోగ్యం బాలేదని, అతని పరిస్థితి ఐసీయూలో సీరియస్ గా ఉందని, సెలవు కావాలని ఆమె అడిగిన తక్షణం మరోమారు ఆ అధికారి ఇలా డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.