Lady Teacher Gender Change : లింగ‌మార్పిడి చేసుకుని.. విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళ టీచ‌ర్‌

రాజ‌స్థాన్ లోని భ‌ర‌త్‌పూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పీఈటీ టీచ‌ర్ త‌న విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. లేడీ ల‌వ‌ర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ లేడీ టీచ‌ర్ లింగ మార్పిడి చేయించుకున్నారు. మ‌గ‌వాడిగా మారిన త‌ర్వాత త‌న విద్యార్థినే ఆమె పెళ్లి చేసుకున్నారు.

Lady Teacher Gender Change : లింగ‌మార్పిడి చేసుకుని.. విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళ టీచ‌ర్‌

LADY TEACHER

lady teacher gender change : రాజ‌స్థాన్ లోని భ‌ర‌త్‌పూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా పీఈటీ టీచ‌ర్ త‌న విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. లేడీ ల‌వ‌ర్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆ లేడీ టీచ‌ర్ లింగ మార్పిడి చేయించుకున్నారు. మ‌గ‌వాడిగా మారిన త‌ర్వాత త‌న విద్యార్థినే ఆమె పెళ్లి చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. 2016లో మీరా, క‌ల్ప‌న అనే ఇద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది.

రెండేళ్లుగా ఫుల్ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. ఆ త‌ర్వాత 2018లో క‌ల్ప‌న‌కు మీరా ప్ర‌పోజ్ చేశారు. మీరా చేసిన పెళ్లి ప్ర‌పోజ్‌ల‌కు క‌ల్ప‌న అంగీక‌రించారు. కానీ త‌మ‌ పెళ్లికి పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటుందని ఆ ఇద్ద‌రు అమ్మాయిలు గ్ర‌హించారు. అందుకే మీరా లింగ‌మార్పిడికి సిద్ధమయ్యారు. క‌ల్ప‌న‌ను పెళ్లి చేసుకునేందుకు మ‌గ‌వాడిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నారు.

Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి

ఆపరేషన్ త‌ర్వాత ఆర‌వ్‌గా పేరు మార్చుకున్న‌ారు. 2019 డిసెంబ‌ర్‌లో మీరా తొలి ఆపరేషన్ చేయించుకున్న‌ారు. ఆర‌వ్‌ను ముందు నుంచే ప్రేమిస్తున్నాన‌ని, ఒక‌వేళ అత‌ను ఆపరేషన్ చేయించుకోకున్నా.. తాను అత‌న్నే పెళ్లి చేసుకునేదాన్ని అని క‌ల్ప‌న వెల్లడించారు. ఆపరేషన్ జరిగిన స‌మ‌యంలో ఆర‌వ్‌తోనే ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.