పశువుల పాకే పాఠశాల : జడ్జీ అయిన పాల వ్యాపారి కూతురు..చదువుల తల్లికి తల వంచిన పేదరికం

పశువుల పాకే పాఠశాల : జడ్జీ అయిన పాల వ్యాపారి కూతురు..చదువుల తల్లికి తల వంచిన పేదరికం

Rajasthan milkman daughter set to become a judge : చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే కోరిక ఉంటే ఏసీ రూముల్లో పట్టు పరుపులమీద కూర్చునే చదవనక్కరలేదు. పశువుల పాకలో కూర్చుని చదువుకున్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించింది రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన సోనాల్ శర్మ. పేదరికం వెక్కిరించినా ఆమెలో ఆత్మవిశ్వాసం చెదరలేదు. పశువల పాకనే పాఠశాలగా చేసుకుని పట్టుదలతో చదివింది..ఆటంకాలను ఎదరీది తన కలలను సాకారం చేసుకుంది. బీఏ, ఎల్ ఎల్ బీ, ఎల్ఎల్ ఎమ్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచింది. త్వరలో న్యాయమూర్తికానుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఓ పాల వ్యాపారి కూతురు పశువుల పాకలో కూర్చుని చదువుకుని అతి త్వరలో న్యాయమూర్తి పదవిని అలంకరించనుంది సోనాల్ శర్మ.

ఉదయ్ పూర్ కు చెందిన సోనాల్ శర్మ తండ్రి అతి సాధారణ పాల వ్యాపారి. కొన్ని పాడి పశువులతో పాల వ్యాపారం చేస్తుంటాడు. కానీ సోలాన్ కు మాత్రం చదువంటే పంచప్రాణాలు. జడ్జీ అవ్వాలని కోరిక. కానీ తండ్రికి అంత స్తోమత లేదు.ఇంట్లో అందరూ కష్టపడితేనే కానీ కడుపులు నిండని దీనస్థితి. కానీ సోనాల్ తో పాటు మరో ముగ్గురు పిల్లలున్నారు పాల వ్యాపారికి. తండ్రితో పాటు రోజు ఉదయం 4గంటలకే లేచి సోనాల్ పశువుల పాకలో పనిచేసేది. అలాగే పశువులకు గడ్డి వేస్తూ..కుడితి పెడుతూ..పేడ ఎత్తుతూ..పాలు పితుకుతూ అక్కడే కూర్చుని చదువుకునేది. రోజుకు రెండు పూటలా పాలు పితుకుతు వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబం అంతా బతికేది. కూతురుకి చదువంటే ఎంతిష్టమో తెలిసినా ఏమీ చేయలేని పేద తండ్రి అతను.

అలా కష్టపడి చదువుకున్న సోనాల్ BA, LLB,LLM లో టాప్ ర్యాంకర్ గా నిలిచింది. మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. పశువుల పాకలో కూర్చుని చదువుకుంటూ రెండేళ్లలో ఎల్ఎల్ ఎమ్ లో పూర్తి చేసిన సోనాల్ రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ (RJS)-2018కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ ఈ ఎగ్జామ్ లో విజయం సాధించాలంటే మాటలు కాదు. స్పెషల్ కోచింగ్ ఉండాలి. కానీ దానికిసంబంధించిన పుస్తకాలు కొనుకునే స్తోమత కూడా లేదు. సైకిల్ మీదే కాలేజీకి వెళ్లి లైబ్రరీలోనే చదువుకునేది. అక్కడే నోడ్స్ రాసుకునేది. కాలేజీ నుంచి ఇంటికొచ్చినప్పటినుంచి మళ్లీ పశువుల పాకలో పనిచేయాలి. అలా పనిచేసుకుంటూ వీలు చేసుకుని చదువుకుంటూ RJS ఎగ్జామ్ రాసింది.

గత సంవత్సరం RJS-2018 పరీక్షా ఫలితాలు విడుదల కాగా..సోనాల్ ఒకే ఒక్క మార్కు తేడాతో అర్హుల లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఏఢుగురు సర్వీస్ లో జాయిన్ కాలేదు. ఇది తెలిసిన సోనాల్ తనకు అవకాశ ఇవ్వాల్సిందిగా రాజస్థాన్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆ ఏడుగురు అభ్యర్థుల స్థానాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారితో భర్తీ చేయాలని నోటిషికేషన్ విడుదల చేసింది. దీంతో సోనాల్ లైన్ క్లియర్ అయ్యింది. త్వరాలోనే రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా బాధ్యతలు తీసుకోనుంది సోనాల్ శర్మ. ఈ క్రమంలో మొదటిసారి యత్నంలోనే మెజిస్ట్రేట్ అవకాశం దక్కించుకున్న యువతిగా సోనాల్ శర్మ గుర్తింపు పొందింది.

ఈ సంతోష సందర్భంగా సోనాల్ శర్మ ఆనందంతో ఉప్పొంగిపోతోంది. మా నాన్న ఓ సాధారణ పాల వ్యాపారి. మాకొచ్చి కొద్దిపాటి ఆదాయంతో మా నలుగుర్ని చదివించటానికి చాలా కష్టాలు పడ్డారు. మా చదువుల కోసం లోన్లు కూడా తీసుకున్నారు. ఇన్ని కష్టాల్లో కూడా ఆడపిల్లకు చదువెందుకని మా నాన్న అనుకోలేదు. తనలా మేం కష్టపడకూడదని అందుకే చదివిస్తున్నానని నా నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రోత్సహించేవారిని తెలిపింది సోనాల్.

మా తల్లిదండ్రుల శ్రమ వృథా కాకుండదు..అందుకే పట్టుదలతో చదువుకున్నా..పశువు పాకలోనే మా నాన్న నా కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేసుకున్నా.. ఖాళీ నూనె డబ్బాల్నే టేబుల్ గా చేసుకుని ఓ పక్క పశువులను చూసుకుంటూ మరోపక్క నా చదువు కొనసాగించుకున్నా..మా నాన్న పాల వ్యాపారి అను చెప్పుకోవటానికి చిన్నప్పుడు స్కూల్లో చెప్పుకోవటానికి సిగ్గు పడేదాన్ని. కానీ మా నాన్న కష్టం చూశాక నాకు సిగ్గు వేసింది. ఇటువంటి తండ్రికి పుట్టినందుకు నేను గర్వపడుతున్నానని..ఆ కష్టంతోనే మమ్మల్ని చదివించిన నా తండ్రి చాలా గొప్పవాడని చెప్పటానికి నేను ఎప్పుడు గర్వపడుతుంటానని సోనాల్ భావోద్వేగంగా చెప్పింది.

నా విజయం నా కుటుంబంలో ఆనందాన్ని నింపిందని ఆనందంగా చెప్పింది సోనాల్. ఈ ఆనందంలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేజ్ గా బాధ్యతలు స్వీకరిస్తుందన్నందుకు దానికి కారణమైన నా కుటుంబ ప్రోత్సాహం మరువలేనని..నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటానని చెబుతోంది ఈ రాజస్తానం రత్నం సోనాల్ శర్మ.