Jaipur Accident:ఆగిన లారీని ఢీకొన్న కారు..పరీక్ష రాసేందుకు వెళ్తు..ఐదుగురు విద్యార్ధులు మృతి

పరీక్ష రాయటానికి వెళ్తున్న విద్యార్ధులు ప్రయాణించే కారు ప్రమాదానికి గురై ఐదుగురు విద్యార్ధులకు దుర్మరణం పాలయ్యారు. ఆగిన లారీని కారు ఢీకొనటంతో డ్రైవర్ తో సహా విద్యార్ధులు చనిపోయారు.

Jaipur Accident:ఆగిన లారీని ఢీకొన్న కారు..పరీక్ష రాసేందుకు వెళ్తు..ఐదుగురు విద్యార్ధులు మృతి

Jaipur Road Accident

Jaipur Accident..six Died : రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని జైపూర్‌- ఢిల్లీ జాతీయ రహదారిపై శనివారం (సెప్టెంబర్ 25,2021) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్‌ ఉన్నాడు. రీట్‌ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలిసింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టటంతో ఈ ప్రమాదం సంభవించింది.

కాగా..అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి డ్రైవ్ చేయటం వంటి పలు కారణాలతో భారత్ లో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలతో బాధితుల కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు.

భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం.. హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. 2019లో అతి వేగం కారణంగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను రోడ్డు ప్రమాదాల వార్షిక నివేదిక అధికారులు వెల్లడించారు.

దేశంలో సగటున ప్రతిరోజూ 1,230 రోడ్డు ప్రమాదాలు, 414 మరణాలు నమోదవుతున్నాయి. అంటే ప్రతి గంటకు 51 ప్రమాదాలు జరుగుతుండగా, 17 మంది చనిపోతున్నారని అర్థం. కానీ ఈ సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాలు ఎంతగా జరుగుతున్నాయో తెలియజేస్తోంది.