Rajasthan vs Delhi, 7th Match – టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Rajasthan vs Delhi, 7th Match – టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!

Rajasthan Royals Have Won The Toss And Have Opted To Field 2

ఐపీఎల్‌ 2021లో ఏడవ మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌పై ఓడి రెండవ మ్యాచ్‌లో గెలవాలని రెడీ అయ్యింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డిండ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.

ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచుల్లో రెండు జట్లూ చెరో 11 మ్యాచుల్లో నెగ్గాయి. చివరి ఐదు మ్యాచుల్లో మాత్రం గెలుపు ఢిల్లీదే. వాంఖడేలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ పిచ్‌లో పరుగులు బాగా రాబట్టవచ్చు. కాబట్టి భారీ స్కోర్లు అంచనా వేస్తున్నారు.

జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్(Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Ajinkya Rahane, Marcus Stoinis, Chris Woakes, Ravichandran Ashwin, Lalit Yadav, Kagiso Rabada, Tom Curran, Avesh Khan

రాజస్థాన్ రాయల్స్(Playing XI): Manan Vohra, Sanju Samson(w/c), David Miller, Jos Buttler, Shivam Dube, Riyan Parag, Rahul Tewatia, Chris Morris, Chetan Sakariya, Jaydev Unadkat, Mustafizur Rahman