RR Vs PBKS IPL 2021 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్ లో ఇది 4వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. మంచు ప్రభావంతో, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

RR Vs PBKS IPL 2021 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

Rr Vs Pbks Ipl 2021

RR Vs PBKS IPL 2021 : ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్ లో ఇది 4వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. మంచు ప్రభావంతో, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

గతేడాది (2020) యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో ఆరు విజయాలు ఎనిమిది ఓటములు చవిచూసిన రాజస్థాన్‌.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంజాబ్‌‌ సైతం అవే ఫలితాలు సాధించినా రన్‌రేట్‌ పరంగా మెరుగ్గా ఉండడంతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో విజయంతో తమ జర్నీ ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

పంజాబ్, రాజస్థాన్ జట్ల బలం వారి బ్యాటింగ్. దీంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, స్టార్టింగ్‌లో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. కానీ బంతి పాతదైన వెంటనే బ్యాటింగ్‌కు సులభం అవుతుంది.