Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.

Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. మరణించిన ఇద్దరు చిన్నారుల్లో ఒక బాలుడి వయసు నాలుగేళ్లు కాగా, మరో చిన్నారికి నెల కంటే తక్కువ వయసే ఉంటుంది.

Bike Stunt: బైకుపై శక్తిమాన్ స్టంట్లు.. యువకుడి అరెస్టు

అక్కచెల్లెళ్లను కాలూ మీనా (25), మమతా మీనా (23), కమ్లేష్ మీనా (20)గా గుర్తించారు. జైపూర్ జిల్లాలోని దూదు అనే గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం జరిగిన వేధింపులే ఐదుగురి మరణానికి కారణమని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. భర్తలతోపాటు అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు తమ కూతుళ్లను కట్నం కోసం వేధించేవారని, వాళ్లే తమ పిల్లల చావుకు కారణం అని మృతుల తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల తాను దూదు వచ్చినప్పుడు.. తమను కొడుతున్నారని, కట్నం కోసం వేధిస్తున్నారని కమ్లేష్ మీనా చెప్పినట్లు ఆమె తండ్రి తెలిపారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తే, అక్కడ్నుంచి వెళ్లిపోవాలని, లేదంటే తనను కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు

అయితే, గత బుధవారం నుంచే వాళ్లు కనిపించకుండా పోయారు. అప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తర్వాతి రోజు కట్నం కోసం వేధింపులు, భార్యపై హింసకు పాల్పడటం వంటి కేసులు నమోదు చేశారు. వాళ్లు కనిపించకుండా పోయినప్పుడే, భర్తలు చంపేసి ఉంటారని అనుమానం కలిగిందని, అయితే, ఈ విషయంలో పోలీసులు నెమ్మదిగా స్పందించారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు మృతులుసహా, కడుపులో ఉన్న ఇద్దరు శిశువులతో కలిపి ఏడుగురి మరణానికి మహిళల భర్తలు, కుటుంబ సభ్యులే కారణమని, ఇంతటి క్రూరమైన నేరానికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతున్నారు. అయితే, ప్రాథమికంగా ఇది ఆత్మహత్యలాగే కనిపిస్తోందని, పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చాకే హత్యా.. ఆత్మహత్యా అనే విషయం తెలుస్తుందని, తదుపరి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.