రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత..

10TV Telugu News

Rajinikanth Strong illness: సూపర్‌స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీను శుక్రవారం ఉదయం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రజినీ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Rajinikanth

రజినీ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ రెండు రోజుల క్రితం కరోనా కారణంగా వాయిదా పడింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన టీం షూటింగ్ ఆపేశారు. అప్పుడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో రజినీకు నెగెటివ్‌గా నిర్థారణ అయ్యింది.

Rajinikanth

రాజకీయ రంగ ప్రవేశం దృష్ట్యా 2021 జనవరి 12 నాటికి సినిమాను పూర్తి చేసేయాలని రోజుకి 14 గంటలపాటు పని చేశారు రజినీ.. పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ దగ్గరుండి రజినీ వ్యవహారాలన్నీ చూస్తున్నారు.

×