Rajiv Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ Rajiv Kumar appointed as next Chief Election Commissioner

Rajiv Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నారు.

Rajiv Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

Rajiv Kumar: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నారు. రాజీవ్ కుమార్ నియామకాన్ని ఖరారు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర రిటైర్ కానుండటంతో, కొత్త సీఈసీగా రాజీవ్‌ను కేంద్రం నియమించింది.

 

రాజీవ్ 1984 బ్యాచ్‌నకు చెందిన, బిహార్/ఝార్ఖండ్ క్యాడర్, సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. ప్రభుత్వ అధికారిగా 37 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో రాజీవ్.. ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, నాబార్డు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

×